సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న తాజా చిత్రానికి ప్రముఖ క్రియేటివ్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి 'దర్బార్' అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్‌లుక్ వదిలారు. ఫస్ట్‌లుక్‌ని బట్టి ఈ సినిమా తీరు,తెన్నులు ఫలానా అని అభిమానులు ఓ అంచనాకి వచ్చారు. ఇక ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి తాజాగా ప్రచారానికొచ్చింది. హీరోయిన్ నేపథ్యంలో ఈ సినిమా కథ తిరుగుతుందట.
నిజానికి మురుగదాస్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ నయనతార కావడంతో, నయనతార స్టార్‌డమ్‌ని దృష్టిలో పెట్టుకుని, హీరోయిన్ పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దాడట మురుగదాస్. పూర్తిగా నయనతార యాంగిల్ నుండే సినిమా ఉంటుందనీ అంటున్నారు. ప్రస్తుతం నయనతార తమిళంలో లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతోంది. ఆ మాటకొస్తే, తమిళంలోనే కాదు, తెలుగులో కూడా నయనతారే క్వీన్.
సో ఆమె హీరోయిన్‌గా సినిమా అంటే అది సినిమాకి ఎక్స్‌ట్రా స్టార్‌డమ్‌ని తీసుకొచ్చేదే. ఇక ఓ వైపు సూపర్‌స్టార్ రజనీకాంత్. మరో పక్క లేడీ సూపర్‌స్టార్ నయనతార అన్నీ వెరసి, మురుగదాస్ 'దర్బార్'తో గట్టి హిట్‌కే ప్లాన్ చేశాడనిపిస్తోంది. వీలైనంత త్వరలో ఈ సినిమాని కంప్లీట్ చేయాలనుకుంటున్నారట. దాంతో 'దర్బార్' చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందనీ కోలీవుడ్ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారమ్.