బాల‌య్య ఈ సారి ఖచ్చితంగా బ‌రువు త‌గ్గాల్సిందే..!

By iQlikMovies - April 24, 2019 - 16:30 PM IST

మరిన్ని వార్తలు

దాదాపు మూడు నెల‌ల పాటు రాజ‌కీయాల్లో త‌ల‌మున‌క‌లైపోయాడు బాల‌కృష్ణ‌. ఎన్నిక‌ల హంగామా ముగిసింది. ఇప్పుడు మ‌ళ్లీ మేక‌ప్ వేసుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. బాల‌య్య త‌దుప‌రి చిత్రం బోయ‌పాటి శ్రీ‌నుతో అనే సంగ‌తి తెలిసిందే. క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు ఫ్లాపులు అవ్వ‌డంతో ఈ సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు బాల‌య్య‌. మ‌రోవైపు బోయ‌పాటి శ్రీ‌నుది కూడా అదే ప‌రిస్థితి. విన‌య విధేయ రామా లాంటి డిజాస్ట‌ర్ త‌ర‌వాత త‌న‌ని తాను నిరూపించుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. అందుకే బాల‌య్య సినిమాపై ఫోక‌స్ పెట్టాడు. కెరీర్ ప‌రంగా ఈ సినిమా ఇద్ద‌రికీ చాలా కీల‌కం. అందుకే ఈ సినిమా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు వినికిడి.

మే - జూన్‌ల‌లో షూటింగ్ ప్రారంభం కావాల్సిఉంది. కాక‌పోతే..ఇప్పుడు కాస్త ఆల‌స్యంగా ప‌ట్టాలెక్కే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. బాల‌య్య ఈమ‌ధ్య బాగా బొద్దుగా త‌యార‌య్యారు. ఎండ‌లో తిర‌డం వ‌ల్ల గ్లామ‌ర్ దెబ్బ‌తింది. అందుకే తేరుకోవ‌డానికి మ‌రికాస్త స‌మ‌యం తీసుకోవాల‌నుకుంటున్నాడ‌ని తెలుస్తోంది. జిమ్‌లో క‌స‌ర‌త్తు చేసి - బ‌రువు త‌గ్గాల‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం బాల‌య్య అదే ప‌నిలో ఉన్నార‌ని, క‌నీసం మూడు నెల‌ల పాటు బ‌రువు త‌గ్గేందుకు క‌స‌ర‌త్తులు చేస్తార‌ని, కావ‌ల్సిన షేప్ వ‌చ్చాకే షూటింగ్ మొద‌లెడ‌తార‌ని స‌మాచారం. ఎప్పుడు మొద‌లెట్టినా స‌రే.. ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి విడుద‌ల చేయాల‌న్న‌ది బాల‌య్య ప్లాన్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS