నందమూరి నటసింహం బాలకృష్ణ మరోసారి తాతయ్య అయ్యాడు. కొన్నేళ్ళ క్రితం ఆయన మొదటి కూతురు బ్రాహ్మిణి కి దేవాన్ష్ జన్మించగా ఇప్పుడు ఆయన రెండవ కూతురు అయిన తేజస్వికి ఒక పండంటి బిడ్డ జన్మించాడట.
తెలియవస్తున్న వివరాల ప్రకారం, నిన్న అనగా శుక్రవారం నాడు తేజస్విని-శ్రీ భరత్ ల దంపతులకి ఒక మగబిడ్డ పుట్టాడట. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్టు డాక్టర్లు చెప్పారని సమాచారం. ఈ వార్త ఇపుడు వైరల్ గా మారింది. ఈ సందర్భంగా అందరూ సోషల్ మీడియా వేదికగా బాలయ్యకి శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇక ఈ వార్త నందమూరి కుటుంబంలో అలాగే నందమూరి అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నది. అయితే ఈ వార్తకి సంబంధించి అధికారిక ప్రకటన బాలయ్య నుండి ఆయన కుటుంబసభ్యుల నుండి కాని వెలువడాల్సి ఉంది.
ఏదేమైనా బాలయ్యకి మరో మనువడు పుట్టిన సందర్భంలో మా శుభాకాంక్షలు.