తెలంగాణ ముఖ్యమంత్రి KCRని పొగడ్తలతో ముంచెత్తాడు సినీ హీరో సుమన్. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకి ఏమి కావాలో ముందే తెలుసుకుని మరి వారికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు అంటూ కీర్తించాడు.
అయితే తాను క్రియాశీలక రాజకీయాల్లోకి మాత్రం ముఖ్యమంత్రి KCR పిలిస్తే తప్పక వస్తాను అని ప్రకటించాడు అలాగే తెరాసలో కూడా చేరతాను అని తెలియచేశాడు. ఇక దీనితో ఆయన ఎప్పటినుండో రాజకీయాల్లోకి అలాగే TRS పార్టీలోకి వస్తాడు అన్న సంకేతాల నడుమ ఈయన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇక ఈయన గనుక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే, ఈ మధ్యకాలంలో రాజకీయాల్లోకి వచ్చిన సినీ కళాకారుల జాబీతాలో సుమన్ చేరుతాడు. ప్రస్తుతం అయితే తెలుగుతో పాటు అన్ని భాషల్లోను నటిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.
మొత్తానికి సుమన్ ప్రకటన ఇప్పుడు ఫిలిం నగర్ లో చర్చనీయాంశంగా మారింది.