ఇంకోస్సారి: పూరీ డైరెక్షన్‌లో బాలకృష్ణ.?

మరిన్ని వార్తలు

ఇటీవల కొడుకు ఆకాష్‌ పూరీతో 'మెహబూబా' సినిమాని తెరకెక్కించిన పూరీ జగన్నాధ్‌ లేటెస్టుగా బాలయ్యను కలిశాడట. 'పైసా వసూల్‌' సినిమా టైంలో వీరిద్దరూ కలిసి మరో సినిమా చేద్దామనుకున్నారు. అందుకే పూరీ బాలయ్యని కలిసి కథ వినిపించాడనీ సమాచారమ్‌. 

ఆ కథ బాలయ్యకు నచ్చిందట కూడా. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న 'ఎన్టీఆర్‌' చిత్రానికి డైరెక్టర్‌ కన్‌ఫామ్‌ కాకపోవడంతో, సందిగ్ధంలో పడిపోయిన బాలయ్య ఆ సినిమాకి సంబంధించి ఇంకా ఓ క్లారిటీకి రాకపోవడంతో పూరీతో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడనీ తెలుస్తోంది. అంతేకాదు, పూరీతో సినిమా అంటే చాలా కంఫర్ట్‌ టైమ్‌ పరంగా, చాలా తక్కువ టైంలోనే పూరీ సినిమాని కంప్లీట్‌ చేసేస్తాడు. 

సినిమా అనౌన్స్‌ చేసినప్పుడే రిలీజ్‌ డేట్‌ కూడా అనౌన్స్‌ చేసి, 'పైసా వసూల్‌' సినిమాని అనుకున్న టైంకే విడుదల చేసేశాడు పూరీ. అలాగే ఈ తాజా ప్రాజెక్టును కూడా అతి తొందర్లోనే పట్టాలెక్కించేసి, పూర్తి చేసే యోచనలో పూరీ అండ్‌ బాలయ్య ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌లో వచ్చిన 'పైసా వసూల్‌' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఫెయిలైనా, బాలయ్యకు పూరీపై నమ్మకం అలాగే ఉందట. ఆ నమ్మకంతోనే కొత్త ప్రాజెక్ట్‌కి సై అన్నాడనీ తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే, బాలయ్య మరోవైపు వినాయక్‌తో ఓ చిత్రానికి కమిట్‌ అయ్యాడు. ఆ సినిమా కూడా రేపో మాపో పట్టాలెక్కనుందనీ సమాచారమ్‌. అలాగే పూరీ, నాగార్జునకు కూడా ఓ స్టోరీ లైన్‌ చెప్పాడనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. ఇదంతా ఇలా ఉంటే, 'మెహబూబా' తర్వాత తన నెక్స్ట్‌ సినిమా ఆకాష్‌తోనే చేస్తాన న్నాడు పూరీ. ఇన్ని ఆప్షన్లు పెట్టుకుని, ఎలాగోలా హిట్‌ కొట్టి, పూర్వ వైభవం పొందాలనే గట్టి కసితో ఉన్నాడు పూరీ. చూడాలి మరి పూరీ ప్రయత్నాలు ఎంత మేర ఫలిస్తాయో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS