మే 28 ఎన్టీఆర్ జయంతి. ఈ సందర్భంగా తనయుడు, నట, రాజకీయ వారసుడు నందమూరి బాలకృష్ణ నుంచి ఓ సర్‌ప్రైజ్ రాబోతోందని బుధవారం ఓ ప్రటకన వచ్చింది. అదేమిటో ఇప్పుడు తెలిసిపోయింది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా.. బాలయ్య శ్రీరామ దండకం ఆలపించాడట. అది... ఓ వీడియో రూపంలో శుక్రవారం ఉదయం 9 గంటల 45 నిమిషాలకు విడుదల కానుంది. బాలయ్యకు పాటలు పాడడం కొత్తేం కాదు. ఇది వరకు.. పైసా వసూల్ లో మామా ఏక్ పెగ్ లా.. పాట పాడి అభిమానుల్ని అలరించాడు.
శివశంకరీ స్త్రోత్తం బాలయ్య పాడిన విధానం మనకింకా గుర్తు ఉండనే ఉంది. ఇప్పుడు మరోసారి గాయకుడిగా అవతారం ఎత్తాడన్నమాట. ఎన్టీఆర్ అంటేనే శ్రీరాముడి పాత్రలకు కేరాఫ్ అడ్రస్స్. వివిధ చిత్రాల్లో ఎన్టీఆర్ శ్రీరాముడి గెటప్పుల్ని కవర్ చేస్తూ.... నేపథ్యంలో బాలయ్య రామ దండకం వినిపిస్తాడట. మరి ఈ దండకం.. నందమూరి అభిమానులకు ఏమేరకు నచ్చుతుందో చూడాలి.