యూవీ క్రియేషన్స్ నుంచి వస్తున్న ఓ చిన్న సినిమా `ఏక్ మినీ కథ`. సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. గత నెలలో థియేటరికల్ రిలీజ్ కి చిత్రబృందం ఏర్పాట్లు చేసింది. అయితే కరోనా సెకండ్ వేవ్ ఉధృతి వల్ల... అన్ని సినిమాలతో పాటు `ఏక్ మినీ కథ` రిలీజ్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు నేరుగా అమేజాన్ లో విడుదల అయ్యింది. ఈ సినిమాని అమేజాన్ ఏకంగా 9 కోట్లకు కొనుగోలు చేసింది.
సినిమా బడ్జెట్ 2.5 కోట్లు మాత్రమే. అంటే.. ఏకంగా 6.5 కోట్లు లాభమన్నమాట. అమేజాన్ దగ్గరే థియేటరికల్ రైట్స్, రీమేక్ , డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ మొత్తం ఉన్నాయి. ఏ రకంగా చూసినా ఇది మంచి బేరమే. యూవీ అంటే భారీ చిత్రాలకు పెట్టింది పేరు. అయితే ఆ బ్యానర్ నుంచి కొన్ని చిన్న సినిమాలూ వచ్చాయి. వాటిలో ఏ ఒక్కటీ.. హిట్ కాలేదు. ఏక్ మినీ కథ మాత్రం లాభాల్ని తీసుకొచ్చింది.