నటనలో తనకంటూ ఒక ట్రేడ్ మార్క్ సంపాదించుకున్న బాలకృష్ణ ఈ మధ్యనే తనలోని గాయకుడిని పైసా వసూల్ చిత్రం ద్వారా ప్రపంచానికి పరిచయం చేయనున్నాడు.
ఇక ఇప్పుడు తన తండ్రి జీవితంపై నిర్మించబోయే కథకి తాను రచయతగా మారి ఇప్పుడు తనలోని మరో కోణాన్ని ప్రదర్శించనున్నాడు. అది ఎలాగంటే- నందమూరి తారక రామారావు జీవితంపై తెరకెక్కుతున్న చిత్రం తాలుకా కథని కొంతమంది చేత రాయించడం జరిగింది. ఇప్పుడు ఆ కథకి తనదైన శైలిలో కీలక మార్పులు చేయడానికి బాలయ్య సిద్ధం అయ్యాడు.
దీనితో ఈ చిత్రానికి సంబందించిన కథా సహకారంలో బాలయ్య పేరుని మనం చూడనున్నామనమాట. ఇప్పటికే ఈ చిత్రం పై అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో ఇలాంటి కిక్ ఇచ్చే వార్త బయటకి రావడం ఈ సినిమాపై అంచనాలని పదింతలు చేస్తున్నాయి.
మొత్తానికి.. బాలయ్య బాబు రైటర్ గా కొత్త అవతారంలో కనపడనున్నాడు.