మాస్ హీరో బాలకృష్ణ అలాగే మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ల కలయికలో ఒక భారీ మాస్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ దొరికింది.
అందుతున్న సమాచారం ప్రకారం, వీరిద్దరి కలయికలో ఒక భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ కి రంగం సిద్ధం అయింది. ఇప్పటికే దాదాపుగా కథని కూడా ఒకే చేసేసినట్టు తెలుస్తున్నది. ఈ చిత్రాన్ని నిర్మాత C కళ్యాణ్ నిర్మించనున్నట్టుగా ఫిలిం నగర్ సమాచారం.
అన్ని కుదిరితే, ఈ చిత్ర షూటింగ్ మే నెల నుండి మొదలవుతుందట. అయితే ఈ సినిమా లో నందమూరి అభిమానులు వారి అభిమాన హీరో అయిన బాలయ్య నుండి కోరుకునే అన్ని మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి అని మాత్రం కచ్చితంగా తెలుస్తున్న విషయం.
చాలా సంవత్సరాల క్రితం వీరి కలయికలో వచ్చిన చెన్నకేశవ రెడ్డి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా ఆ చిత్రం వల్ల వీరిరువురికి మంచి పేరొచ్చింది.
ఇక ఈ సారి వీరి కలయికలో కచ్చితంగా సూపర్ హిట్ ఖాయం అన్న సంకేతాలు అందుతున్నాయి.