ఈమధ్యనే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం సినీ పరిశ్రమ నుండి స్పందన ఎందుకు రావట్లేదు అన్న అంశం పైన తీవ్ర దుమారం చెలరేగుతున్నది. ఈ సందర్భంలో ఒక ప్రముఖ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో సదరు యాంకర్ సినిమా ఇండస్ట్రీ లో స్త్రీలని చాలా అసభ్యకర రీతిలో పోల్చుతూ మాట్లాడాడం జరిగింది.
ఈ అంశాన్ని వెంటనే మా సభ్యులు ఖండించడంతో పాటు సదరు యాంకర్ పైన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లోని పోలీసులకి రాత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. ఇదే సమయంలో పలు పోలీస్ స్టేషన్ లలో కూడా ఆయన పైన ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టు స్పష్టమవుతున్నది.
ఇక ఇదే డిబేట్ లో పాల్గొన్న పోసాని కృష్ణమురళి తో మాట్లాడేటప్పుడు ఆ యాంకర్ ఇటువంటి పదాలు మాట్లాడి వారిని కించపరిచినట్లు వీడియో లు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఒక బాధ్యత కలిగిన స్థానంలో ఉంది ఇటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం తగదు అని అందరు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి ఈ ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు సినీ పరిశ్రమని కూడా కుదిపేస్తున్నది.