హిందూపురం నియోజక వర్గంలో బాలయ్య మళ్లీ గెలిచారు. సైకిల్‌కి ఎదురు గాలి వీచినా, బాలయ్యకు మాత్రం అనుకూల పవనాలు వీచాయిక్కడ. రాజకీయాల్లో బాలయ్య తన రికార్డుని తాను మళ్లీ బద్దలుకొట్టారు. 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన బాలయ్య హిందూపురం నుండి 16,196 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అప్పుడు టీడీపీ గాలి గట్టిగా వీచింది. ఇప్పుడు పరిస్థితి వేరు. ఆంధ్రప్రదేశ్ అంతటా సైకిల్ చతికిలపడింది. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్యకు మెజార్టీ పెరిగడం అంటే విశేషమే. గతంలో కంటే దాదాపు 900 ఓట్లు ఎక్కువ వచ్చాయి బాలయ్యకు ఇప్పుడు. హిందూపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోట.
స్వర్గీయ ఎన్టీఆర్ ఇక్కడి నుండే ప్రాతినిధ్యం వహించారు. దాంతో నియోజక వర్గంలో బాలయ్య పట్ల కొంత వ్యతిరేకత కనిపించినా ఆయన గెలవగలిగారు. ఈసారి కూడా టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే, బాలయ్యకు మంత్రి పదవి దక్కేదేమో. కానీ, దురదృష్టం బాలయ్యకు ఆ అదృష్టం దక్కలేదు. అధికారంలో ఉన్నప్పుడు నియోజక వర్గానికి వెళ్లకపోయినా చెల్లిపోయింది కానీ, ప్రతిపక్షంలో కూర్చొని నియోజక వర్గాన్ని పట్టించుకోకపోతే కూసింత కష్టమేనయ్యా బాలయ్యా.!