అసలు బన్నీకి చెల్లెలే లేదా?

మరిన్ని వార్తలు

బన్నీ తాజా చిత్రం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చెల్లెలి పాత్ర కీలకమనీ, ఆ కీలక పాత్ర కోసం నివేదా థామస్‌ని ఎంచుకున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ సినిమాలో అసలు చెల్లెలి పాత్రే లేదంట అంటూ తాజా గాసిప్‌ వినిపిస్తోంది. మరోవైపు జరుగుతున్న ప్రచారంలో ఎంత మాత్రమూ నిజం లేదనీ, ముద్దుగుమ్మ నివేదా థామస్‌ అఫీషియల్‌గా తేల్చేసింది. బన్నీ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన గత రెండు చిత్రాల్లో 'జులాయి'లో చెల్లెలి పాత్ర ఉంది.

 

ఈ పాత్రలో బుల్లితెర యాంకర్‌ శ్రీముఖి నటించింది. 'సన్నాఫ్‌ సత్యమూరి'తో అన్నయ్య క్యారెక్టర్‌ తప్ప, చెల్లెలి క్యారెక్టర్‌ లేనే లేదు. అన్నయ్యగా వెన్నెల కిషోర్‌ నటించిన సంగతి తెలిసింందే. అలాగే ఈ సినిమాలోనూ చెల్లి పాత్ర లేదనేది లేటెస్ట్‌ టాక్‌. నాన్న సెంటిమెంట్‌తో ఈ సినిమా ఉంటుందట. సెంటిమెంటే కానీ, సీరియస్‌నెస్‌ అస్సలు ఉండదట. ఫుల్‌ ఫన్‌తో సినిమా ఉండబోతోందనీ తెలుస్తోంది.

 

హీరోయిన్‌గా పూజా హెగ్దే నటిస్తోన్న సంగతి తెలిసిందే. తండ్రి సెంటిమెంట్‌తో రూపొందుతోన్న సినిమానే కానీ, ఈ సినిమాలో తండ్రి పాత్ర కోసం త్రివిక్రమ్‌ ఎవర్ని తీసుకున్నారనే విషయంపై క్లారిటీ లేదు. తల్లి పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ టబు నటిస్తోంది. గీతా ఆర్ట్స్‌, హారికా హాసినీ బ్యానర్‌లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS