'ఆర్‌ఆర్‌ఆర్' నుండి షూటింగ్ అప్‌డేట్స్ ఏమీ లేకపోయినా, షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోందనే టాక్ ఉంది. లేటెస్ట్‌గా ఎన్టీఆర్ జోడీ, విలన్స్ పెయిర్ కూడా దొరికేయడంతో, జక్కన్నకు ఓ పెద్ద టెన్షన్ తీరిపోయింది. స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ఫిక్షనల్ స్టోరీస్‌ని ఈ ట్రెండ్‌కి తగ్గట్లుగా మలిచిన పాత్రల్లో రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు యాక్షన్ సీన్స్ తెరకెక్కించడం జరిగింది. దాదాపు 70 శాతం కీలక సన్నివేశాలు చిత్రీకరణ కూడా పూర్తయిపోయింది.
ఎన్టీఆర్, చరణ్ కాంబో సీన్స్ కూడా చిత్రీకరించారు. ఇక ఇప్పుడు 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్ మొత్తం రొమాంటిక్ ట్రాక్ దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్స్‌పై రొమాంటిక్ సాంగ్స్ చిత్రీకరణకు రంగం సిద్ధం చేస్తున్నారట. ముఖ్యంగా కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ విదేశీ భామ ఒలివియా మోరిస్‌తో సాగే లవ్ ట్రాక్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ప్రస్తుతం ఈ జంటపైనే కొన్ని రొమాంటిక్ సీన్స్‌తో పాటు, పాటల చిత్రీకరణ కూడా జరగనుందట. అలాగే, రామ్ చరణ్, అలియాభట్ పైనా సాంగ్స్ చిత్రీకరణకు లొకేషన్ ప్లానింగ్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్ ఉందని తెలుస్తోంది.