లెజెండ్‌కి ఐదేళ్లు.. అక్కడ అదో చెరిగిపోని రికార్డు..!

By iQlikMovies - March 28, 2019 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

బాల‌కృష్ణ కెరీర్‌లోనే అతి పెద్ద విజ‌యం.. లెజెండ్‌. స‌రిగ్గా 2014 ఎన్నిక‌ల‌కు ముందు లెజెండ్ విడుద‌లైంది. ఇందులో బాల‌య్య పేల్చిన పొలిటిక‌ల్ పంచ్‌లు బాగా పేలాయి. జ‌గ‌ప‌తిబాబుని విల‌న్‌గా మార్చింది కూడా ఈ సినిమానే. అప్ప‌టి నుంచి జ‌గ్గూ భాయ్ కెరీర్ స్వ‌రూప‌మే మారిపోయింది. జ‌గ‌ప‌తిబాబు ప‌నైపోయింద‌ని అనుకున్న‌వాళ్లే ఆయ‌న దూకుడు చూసి ఆ త‌ర‌వాత ముక్కుమీద వేలేసుకున్నారు.

బాల‌య్య‌ని బోయ‌పాటి చూపించిన విధానం, బాల‌య్య చెప్పిన ప‌దునైన సంభాష‌ణ‌లు, జ‌గ‌ప‌తి విల‌నిజం, దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం.., ఇవ‌న్నీ క‌లిసి లెజెండ్‌కు భారీ విజ‌యాన్ని అందించాయి. ఈ సినిమాతోనే బోయ‌పాటి త‌న పారితోషికాన్ని రూ.15 కోట్ల‌కు పెంచాడు. 2014 మార్చి 28న విడుద‌లైన ఈ సినిమా అఖండ విజ‌యాన్ని సాధించింది.

క‌ర్నూలులోని ఎమ్మిగ‌నూరులో ఈసినిమా ఏకంగా మూడేళ్ల‌పాటు అడింది. అదో చెరిగిపోని రికార్డు. ఈ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో సినిమా త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది. ఎన్నిక‌ల త‌ర‌వాత ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌బోతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS