టాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ డాన్స్ కొరియోగ్రఫర్స్‌లో జానీ మాస్టర్ ఒకరు. కష్టపడి కష్టపడి ఎట్టకేలకు కొరియోగ్రఫర్‌గా తనదైన శైలిలో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ముఖ్యంగా మాస్ సాంగ్స్‌కి స్టెప్పులు కంపోజ్ చేయాలంటే ఈ జనరేషన్ హీరోలకు ముందుగా గుర్తొచ్చేది జానీ మాస్టర్ పేరే. రామ్‌చరణ్, ఎన్టీఆర్ తదితర యంగ్ హీరోలతో పాటు, చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలకూ డాన్స్ కంపోజ్ చేశారు.
అయితే ఇప్పుడు ఈ జానీ మాస్టర్ జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వస్తోంది. నాలుగేళ్ల క్రితం జరిగిన ఓ గొడవకు సంబంధించి మేడ్చల్ కోర్టులో కేసు నమోదైంది. ఆ కేసు విచారణ జరిపిన కోర్టు తాజాగా తీర్పును వెల్లడించింది. జానీ మాస్టర్‌తో పాటు మరో నలుగురికి ఆరు నెలలు జైలు శిక్షను ఖరారు చేస్తూ, 1500 రూపాయలు జరిమానా కూడా విధించింది. అయితే జానీ మాస్టర్ ఇప్పుడు హైకోర్టుకు అప్పీల్ చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారనీ తెలుస్తోంది.
అర్ధాంతరంగా జైలు శిక్ష పడిన జానీ మాస్టర్ కెరీర్ ఇప్పుడు సందిగ్థంలో పడింది. ఆల్రెడీ ఒప్పుకున్న ప్రాజెక్టులు అగమ్యగోచరంగా మారాయి. వాటిలో కొన్ని అర్జెంట్ ప్రాజెక్టులు జానీ మాస్టర్ చేజారిపోయాయనీ తెలుస్తోంది. ఈ కేసుతో పాటు, జానీ మాస్టర్‌పై గతంలో కొన్ని చెక్ బౌన్స్ కేసులు తదితర ఇతరత్రా కేసులు కూడా ఉన్నాయనీ తెలుస్తోంది. చూడాలి మరి, ఈ కోర్టు కేసుల నుండి బయటపడి జానీ మాస్టర్ కెరీర్‌ని ఎలా ముందుకు తీసుకెళ్లనున్నాడో.