బోయపాటి శ్రీను సినిమాల్లో విలనిజం చాలా భయంకరంగా ఉంటుంది. ప్రతినాయకుల పాత్రల్ని శక్తిమంతంగా తీర్చిదిద్దడంలో బోయపాటి ఘనాపాటి. లెజెండ్ సినిమాతో జగపతిబాబు కెరీర్ మలుపుతిరగడానికి కారణం ఆయనే. సరైనోడులో ఆది పినిశెట్టి క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్ గా తీర్చిదిద్దారు. ఇప్పుడు బాలకృష్ణతో తెరకెక్కించే సినిమాలోనూ విలన్ పాత్ర ఓ రేంజులో ఉండబోతోంది.
ఈ పాత్ర కోసం శ్రీకాంత్ ని ఎంచుకున్నారని ప్రచారం జరిగింది. శ్రీకాంత్ విలన్గా ఇది వరకు కొన్ని సినిమాల్లో కనిపించడంతో శ్రీకాంత్ విలనిజం ఖాయమైందని అనుకున్నారు. అయితే ఈ సినిమాలో శ్రీకాంత్ నటించడం లేదన్నది లేటెస్ట్ టాక్. నిజానికి ఇలాంటి ఆఫరేదీ తన దగ్గరకు రాలేదని శ్రీకాంత్ చెబుతున్నాడట. దాంతో విలన్ పాత్రలో ఎవరు కనిపిస్తారన్న ఆసక్తి నెలకుంది.
ఈ పాత్ర రాజశేఖర్ చేతికి చేరినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజశేఖర్కీ, బాలయ్యకీ మధ్య మంచి రాపో ఉంది. బాలయ్య సినిమా అంటే, అందులో విలన్గానైనా నటించడానికి నేను సిద్ధమే అని ఆమధ్య రాజశేఖర్ కూడా మీడియా ముఖంగా చెప్పారు. సో.. బాలయ్యకు విలన్ దొరికేసినట్టే.