రష్మికపై కన్నేసిన మెగా ప్రిన్స్‌.!

మరిన్ని వార్తలు

రష్మిక నటిస్తే ఆ సినిమా సూపర్‌ హిట్‌ అనే టాక్‌ వచ్చేసింది. ఎన్నాళ్లగానో హిట్‌ కోసం ఎదురు చూస్తున్న నితిన్‌కి రష్మిక రూపంలో ‘భీష్మ’ హిట్‌ వచ్చింది. ఈ సినిమాని ఇంతలా సక్సెస్‌ చేసినందుకు ఫ్యాన్స్‌కి థాంక్స్‌ చెబుతూ, ‘భీష్మ’ టీమ్‌ సక్సెస్‌ మీట్‌ అరేంజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ సక్సెస్‌ మీట్‌కి మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ ఈవెంట్‌లోనే రష్మిక, మెగా ప్రిన్స్‌ని ఇంప్రెస్‌ చేసింది. రష్మిక ఉంటే ఆ సినిమా హిట్టే.. ఈ ఏడాది రెండు సినిమాలతో సూపర్‌ హిట్స్‌ కొట్టేసింది.

 

త్వరలో ఆమెతో కలిసి నేనూ నటించాలనుకుంటున్నా.. అని సభా ముఖంగా వరుణ్‌ తేజ్‌ చెప్పేశాడు. ఇంకేముంది రష్మికకి జాక్‌ పాట్‌ తగిలినట్లే. వన్స్‌ మెగా కాంపౌండ్‌లోకి అడుగు పెట్టిందంటే, అంత త్వరగా ఆ కాంపౌండ్‌ని వీడేది ఉండదు ముద్దుగుమ్మలకి. ఇక రష్మికలాంటి సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్స్‌కైతే, అది గోల్డెన్‌ కాంపౌండే. సో త్వరలోనే మెగా కాంపౌండ్‌కి రష్మిక గ్లామర్‌ యాడ్‌ అవ్వనుందని ఆశించొచ్చేమో. ఇకపోతే, ప్రస్తుతం రష్మిక ఆల్రెడీ మెగా కాంపౌండ్‌ని టచ్‌ చేసినట్లే. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కోసం, మెగా హీరో బన్నీతో జత కడుతోన్న సంగతి తెలిసిందే.

 

ఇక వరుణ్‌ తేజ్‌ చెప్పినట్లుగా ఆయనతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటే, డైరెక్ట్‌గా మెగా కాంపౌండ్‌కి గేట్స్‌ ఓపెన్‌ అయినట్లే కదా. ప్రస్తుతం ‘బాక్సర్‌’ సినిమాతో వరుణ్‌ తేజ్‌ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిజానికి ఇంకా హీరోయిన్‌ కన్‌ఫామ్‌ కాలేదు. బాలీవుడ్‌ బ్యూటీ సయీ మంజ్రేకర్‌ పేరు వినిపిస్తున్నా, అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా రష్మికను చూసి ఇంప్రెస్‌ అయ్యాడు కాబట్టి, వరుణ్‌ రికమెండ్‌ చేస్తే, ‘బాక్సర్‌’తోనే రష్మిక మెగా కాంపౌండ్‌లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చేస్తుంది. చూడాలి మరి, ఏం జరుగుతుందో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS