'నారీ నారీ నడుమ మురారి' బ్యాంకాక్‌లో రొమాన్స్‌కి రెడీ!

మరిన్ని వార్తలు

ఇద్దరు అందాల భామలతో నటసింహం బాలయ్య రొమాన్స్‌కి సిద్ధమయిపోతున్నారు. బాలయ్య ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌కి బ్యూటిఫుల్‌ బ్యాంకాక్‌ వేదిక కానుంది. ఆయన నటిస్తున్న 105వ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 9న బ్యాంకాక్‌లో ప్రారంభించనున్నారట. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న రెండో చిత్రమిది. తొలి షెడ్యూల్‌లోనే పాటల చిత్రీకరణకు శ్రీకారం చుట్టబోతున్నారట. ఈ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు బాలయ్య సరసన ఆడి పాడనున్నారు. వారే వేదిక, సోనాల్‌ చౌహాన్‌. ఆల్రెడీ సోనాల్‌ చౌహాన్‌ బాలయ్యతో రెండు సినిమాల్లో నటించింది.

 

'సెల్ఫీ పాప..' సాంగ్‌ వీరిద్దరి కాంబినేషన్‌లో హిట్‌ సాంగ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక వేదిక, గతంలోనే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైనప్పటికీ, ఇటీవల వచ్చిన 'కాంచన 3' సినిమాతో బౌన్స్‌బ్యాక్‌ అయ్యింది. ఆ వెంటనే ఇదిగో ఇలా బాలయ్యతో నటించే బంపర్‌ ఛాన్స్‌ కొట్టేసింది. ఇక తొలి షెడ్యూల్‌లో ఈ ఇద్దరు భామలు, బాలయ్యతో స్టెప్పులేయనున్నారట.

 

ఇదిలా ఉంటే, ఈ సినిమాలో మరో హీరోయిన్‌ కూడా నటించనుందని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ ద్వారా అందుతోన్న సమాచారం. ఆమె అంతకు ముందు బాలయ్యతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న భామనే అనీ తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో నడుస్తుందనీ తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS