బిగ్‌బాస్‌కి నో చెప్పిన ఫైర్‌ బ్రాండ్‌ యాక్టర్‌!

మరిన్ని వార్తలు

బుల్లితెర మెగా రియాల్టీ షో బిగ్‌బాస్‌ 3 తెలుగు వెర్షన్‌ త్వరలో స్టార్ట్‌ కానుంది. ఈ షోకి హోస్గ్‌గా కింగ్‌ నాగార్జున దాదాపు ఓకే అయినట్లు సమాచారమ్‌ అందుతోంది. నాగార్జున హోస్ట్‌ అంటే, ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు కూడా ఓ రేంజ్‌ వారే ఉండాలని బిగ్‌బాస్‌ నిర్వాహకులు భావిస్తున్నారట. ఈ క్రమంలో ఇప్పటికే కొంతమంది పార్టిసిపెంట్స్‌ని ఖరారు చేశారు. కానీ, అధికారికంగా వారెవరి పేర్లూ బయటికి రాలేదు. పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణూ దేశాయ్‌, సీనియర్‌ యాంకర్‌ ఉదయభానుతో పాటు మరో ప్రముఖ యాంకర్‌, పెద్దగా ఫామ్‌లో లేని కొందరు నటీ నటులు.. ఇలా ఒక లిస్టు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

 

తాజాగా ఈ లిస్టులోకి కె.ఎ.పాల్‌ కూడా వచ్చి చేరారని తెలుస్తోంది. అలాగే ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలుకొట్టే నటుడు కమ్‌ నిర్మాత బండ్ల గణేష్‌ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ, ఈ షోలో పాల్గొనేందుకు ఆయన బిగ్‌బాస్‌ నిర్వాహకులకు కొన్ని షరతులు పెట్టారనీ ప్రచారం జరుగుతోంది. కమెడియన్‌గా ఒకప్పుడు సినిమాల్లో కనిపించిన ఈయన ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అలాగే నిర్మాతగానూ యాక్టివ్‌గా లేరు. ఈ మధ్య పాలిటిక్స్‌ పేరు చెప్పి, కాంగ్రెస్‌ పార్టీ తరపున ఓ రేంజ్‌లో హడావిడి చేశారు. అది కూడా తుస్సుమంది. సో బిగ్‌బాస్‌ ద్వారా ఏమైనా కొత్త హడావిడి చేస్తారా.? అంటే, ఏమో ఆయన పెట్టే షరతులకు బిగ్‌బాస్‌ టీమ్‌ ఒప్పుకుంటుందా.? చూడాలిక. ఇంతకీ ఆయన షరతులేంటంటే, వారానికోసారి మొబైల్‌ ఫోన్‌ తనకు అందుబాటులో ఉండాలని కోరుతున్నారట. కానీ, అది బిగ్‌బాస్‌ రూల్స్‌కి పూర్తిగా వ్యతిరేకం కదా. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS