బండ్ల గణేష్‌కి కరోసా సోకినట్టు టాలీవుడ్ లో వార్తలు గుప్పుమన్నాయి. బండ్ల నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు.కాకపోతే.. ఇన్సైడ్ టాక్ ప్రకారం, ఇటీవల బండ్ల వ్యక్తిగత ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్తే, ఎందుకైనా మంచిదని డాక్టర్లు కరోనా టెస్టులు కూడా చేయించుకోమని సలహా ఇచ్చార్ట. తీరా టెస్టులు చేయిస్తే, బండ్లకు కరోనా ఉందని నిర్దారణ అయ్యింది.
కరోనా లక్షణాలేవీ పైకి కనిపించకపోయినా, తనకు కరోనా సోకడంపై బండ్ల షాక్ కి గురయ్యాడట. వెంటనే కుటుంబ సభ్యులకూ కరోనా టెస్టులు చేయించారని, కానీ.. ఇంట్లో ఎవ్వరికీ కరోనా రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం బండ్ల గణేష్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు తెలుస్తోంది. బండ్లకు బాగా తెలిసిన పాత్రికేయులు ఆయనకు ఫోన్లు చేసి పరామర్శిస్తున్నారు. `ఇదంతా నా బ్యాడ్ లక్. ఇంట్లోవాళ్లకు ఈ వ్యాధి సోకకపోవడం అదృష్టం అనుకోవాలంతే` అని బండ్ల సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట.