ప‌వ‌న్ సెట్టు వ‌ర్షార్ప‌ణం... కోట్ల‌లో న‌ష్టం

మరిన్ని వార్తలు

అస‌లే క‌రోనా వ‌ల్ల ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలు ఆల‌స్యం అవుతున్నాయి. ఇప్పుడు వ‌రుణ దేవుడు కూడా ప‌వ‌న్ సినిమాపై ప‌గ‌బ‌ట్టాడు. వ‌ర్షాల వ‌ల్ల ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాకి రూ. 2 కోట్ల న‌ష్టం వాటిల్లింది.

 

వ‌వ‌న్ - క్రిష్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. మొగల్ సామ్రాజ్యం నాటి క‌థ ఇది. అందుకోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ భారీ సెట్ నిర్మించారు. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు ఈ సెట్ మొత్తం పూర్తిగా పాడైపోయింది. ఇప్పుడు ఆ సెట్లో షూటింగ్ చేయ‌డం దాదాపు అసాధ్యం. ఆ స్థానంలో కొత్త సెట్ వేసుకోవాల్సివ‌స్తోంది. సాధార‌ణంగా ఓ సెట్ నిర్మిస్తున్న‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. వ‌ర్షం పడినా పాడైపోకుండానే సెట్ నిర్మాణం జ‌రుగుతుంది. కానీ ఈ సెట్ పూర్తిగా ఖాళీ ప్ర‌దేశంలో వేయ‌డం వ‌ల్ల‌, వ‌ర్షం నుంచి కాపాడ‌లేక‌పోయారు. అయితే.. సెట్ నిర్మించే ట‌ప్పుడు దానికి ఇన్సురెన్స్ చేయించ‌డం ప‌రిపాటి. అలా ఇన్సురెన్స్ గ‌నుక చేయిస్తే.. న‌ష్టాల్ని భ‌ర్తీ చేసుకునే వీలుంటుంది. లేదంటే.. 2 కోట్లూ పోయిన‌ట్టే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS