బండ్లగణేష్ సోషల్ మీడియాలో హాట్ సెలబ్రీటీ. నటుడిగా నిర్మాతగా కాకుండా ఇంటర్య్యూలో ఇచ్చే పంచ్ డైలాగ్స్‌తో ఆయన మరింత ఆదరణ సంపాదించారు. ట్విటర్ వేదికగా కూడా చాలా యాక్టివ్. ఎవరిపైనా ట్వీట్ చేయడంలో తన శైలిని చూపిస్తుంటారు. వివాదాలు కూడా ఎక్కువే. తాజాగా ఒక ఫిల్మ్ జర్నలిస్ట్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు బండ్ల. పరిశ్రమకు పట్టిన చీడ పురుగు ఈ జర్నలిస్ట్ అని ట్వీట్ మొదలుపెట్టిన బండ్ల చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు.
''ఆయన పేరు మూర్తి. దేవిప్రియ అనే పేరుతో ట్వీట్ చేస్తూ ఉంటాడు. ఆయన బ్రోకర్. ప్రతి హీరో పై ఆర్టికల్ రాస్తూ పబ్బం గడుపుకుంటాడు. కళామతల్లి ముద్దుబిడ్డ చూసాం. వీడు మాత్రం కళామతల్లి తల్లికి పుట్టిన చీడపురుగు. బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. డబ్బు ఆడుకుంటూ ఉంటాడు దేవుడి పేరు చెప్పి అందర్నీ భయపెడుతున్నాడు. వాడి పేరే మూర్తి గాడు. నీకు ఈఎంఐలు కట్టే నిర్మాత ఎవరో నాకు తెలుసు. నీకు ఫోన్ లో కొనిపెట్టే నిర్మాత ఎవరో నాకు తెలుసు. నీకు ఫ్లైట్ టికెట్ కొనే దర్శకుడు ఎవరో నాకు తెలుసు మూర్తి గా'' అంటూ చెలరేగిపోయారు బండ్ల.
బండ్ల కామెంట్ చేసిన జర్నలిస్ట్ కి బండ్ల కి గతంలో మంచి స్నేహం వుండేది. ఇద్దరూ కలసి చాలా క్లోజ్ గా ఇంటర్వ్యూ చేసుకున్నారు. మరి ఎక్కడ చెడిందో కానీ ఒక్కసారి రివర్స్ అయ్యారు బండ్ల.