విశాల్ పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’. సునైనా కథానాయికగా నటిస్తోంది. రమణ, నంద సంయుక్తగా నిర్మిస్తున్నారు.. డిసెంబర్ 22న విడుదలౌతుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి మోహన్ బాబు అతిధిగా వచ్చారు. ఈ వేడుక లో మోహన్ బాబు గురించి విశాల్ ఓ ఆసక్తికరమైన సంగతి చెప్పాడు
''నేను హీరో కావడానికి కారణం... మోహన్ బాబు గారు. నేను టెన్త్ క్లాస్ చదువుకుంటున్నప్పుడు 'యం. ధర్మరాజు ఎం.ఎ' షూటింగ్ కి నాన్న గారు తీసుకెళ్ళారు. ఒక మూల నిలబడి మోహన్ బాబు గారి డైలాగ్ డెలివరీ గమనిస్తున్నాను. అప్పుడు మోహన్ బాబు గారు నన్ను నాన్న గారిని పిలిచి'' ఈ అబ్బాయి మొహంలో కళ వుంది. తప్పకుండా హీరో అవుతాడు'' అన్నారు. అలా చెప్పిన మొదటి వ్యక్తి మోహన్ బాబు గారు. అప్పటికి నేను ఒక నటుడిని అవుతానే ఆలోచన కూడా లేదు. కానీ మోహన్ బాబు గారు అప్పుడే బలంగా చెప్పారు. ఆనాడు ఆయన చెప్పిన మాటలు నిజమయ్యాయి. దేవుడు, ప్రేక్షకుల దయ వల్ల హీరోగా మీ ముందు నిలబడ్డాను'' అని చెప్పుకొచ్చాడు విశాల్.