పీవీవీపై దాడి కేసులో బండ్ల గణేష్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయనపై పలు సెక్షన్లకింద పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టెంపర్ సినిమా కోసం పీవీపీ దగ్గర గణేష్ భారీగా అప్పు తీసుకున్నారు. అందులో కొంత చెల్లించి, ఇంకొంత ఎగ్గొట్టారు. ఆ డబ్బు విషయమై ప్రస్తుతం బండ్ల గణేష్ - పీవీపీ మధ్య వివాదం నడుస్తోంది. పీవీపీ మాత్రమే కాదు.. బండ్ల బాధితులు చాలామంది ఉన్నారని తెలుస్తోంది.
కడపకి చెందిన మహేష్ దగ్గర బండ్ల గణేష్ దాదాపు 13కోట్ల వరకూ అప్పు తీసుకున్నాడట. అది కూడా చెల్లించలేదు. దాంతో మహేష్ కూడా పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కడప పోలీస్ స్టేషన్లో గణేష్ పై మరో కేసు నమోదైంది. ప్రస్తుతం కడప పోలీసుల అధీనంలోనే గణేష్ ఉన్నట్టు తెలుస్తోంది. గణేష్ బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉన్నారని, వాళ్లంతా ఒకొక్కరూ బయటకు వస్తున్నారని సమాచారం.