జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమానుల రూపంలో ఎంతమంది భక్తులు ఉన్నా.. వాళ్ళందరికంటే కూడా పవన్ కి తానే పరమ భక్తుడ్ని అని అవకాశం దొరికినప్పుడల్లా చెప్పుకుంటుంటాడు బండ్ల గణేష్. అయితే ఇటీవలే ఈ భక్తుడు అనేక కేసులతో వార్తల్లో హాట్ టాపిక్ అయ్యాడు.
తాజాగా బండ్లకు పవర్ స్టార్ తో ఎట్టకేలకూ మళ్లీ ఓ సినిమా చేయాలని ఉందట. దాని కోసం సైలెంట్ గా గత కొన్ని నెలలు ముమ్మరంగానే ప్రయత్నాలు చేస్తున్నాడట. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఇక సినిమాలు చేసేది లేదని.. గడ్డం పెంచుకుని మరీ స్పష్టంగా ప్రకటించిన విషయమూ తెలిసిందే. అంతలో పవన్ సినిమాలు మళ్లీ చేయబోతున్నారు అని వార్తలు రావడం, పవన్ కూడా సినిమా చేస్తే తప్పేంటి అని మళ్ళీ మాట మార్చి ప్రకటించడంతో బండ్లలో ఆశ పుట్టింది. ఎలాగైనా పవన్ ను ఒప్పించాలని కిందా మీద పడుతున్నాడు.
ఆ మేరకు కొంతమంది స్టార్ డైరెక్టర్స్ తో కూడా ఇప్పటికే మాట్లాడాడు అట. ఎలాగూ కాంబినేషన్ లను కలిపేసి సినిమాలు నిర్మించడంలో బండ్ల గణేష్ కు బట్టర్ తో పెట్టిన విద్య. ఆ విద్యనే వాడి పవన్ ను కాక పడుతున్నాడట. ఇప్పట్లో కాకపోయినా భవిష్యత్తులోనైనా పవర్ స్టార్ హీరోగా సినిమా చేయడానికి అంగీకరిస్తే పవన్ కి 45 కోట్ల రెమ్యునేషన్ ఇచ్చుకుంటానని కూడా చెప్పుకొచ్చాడట. ఇలా రెమ్యునరేషన్ ల రూపంలో 70 కోట్లు గుమ్మరించి.. మరో 60కోట్లలో ఎలాగోలా సినిమాను పూర్తి చేసి..సినిమాను 180 కోట్లకు బిజినెస్ చేసుకోవాలని ప్రొడ్యూసర్ గా బండ్ల ప్లాన్. మరి బండ్ల ప్లాన్, ప్లాన్ గానే మిగిలిపోతుందో లేదా నేరవేరుతుందో చూడాలి.