బండ్ల గణేష్‌కే ఆ ఛాన్స్‌ ఉందట.!

మరిన్ని వార్తలు

కమెడియన్‌గా చిన్న చిన్న క్యారెక్టర్స్‌ చేసే బండ్ల గణేష్‌ పవర్‌ స్టార్‌ పవన్‌కళ్యాణ్‌కి వీరాభిమాని. అరి వీర భక్తుడు. గత కొంత కాలంగా నటనకు దూరంగా ఉంటున్నాడు. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత 'మహర్షి' సినిమాలో నటిస్తున్నాడు. ఈ మధ్యనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకుని, ఈ సారి ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సే అని వీర కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ చూపించాడు. అయితే ఆయన కాన్ఫిడెన్స్‌ ఫలిస్తుందా.? లేదా.? అని తెలియాలంటే మే 23 వరకూ ఆగాల్సిందే. 

 

కాసేపు ఈ సంగతి పక్కన పెట్టి, సినిమాల విషయానికి వస్తే, పవన్‌ కళ్యాణ్‌ నటించిన 'గబ్బర్‌సింగ్‌' సినిమాని నిర్మించి, నటుడి స్థాయి నుండి ప్రమోషన్‌ అందుకుని, నిర్మాతగా మొదటి ప్లేస్‌ని ఆక్యుపై చేసేశాడు బండ్ల గణేష్‌. రికార్డు స్థాయి విజయంతో బ్లాక్‌బస్టర్‌ వసూళ్లు కొల్లగొట్టిందీ గబ్బర్‌ సింగ్‌ సినిమా అదీ తెలిసిన సంగతే. ఇక ఈయన దేవుడు పవన్‌ కళ్యాణ్‌ విషయానికి వస్తే, ఈయన కూడా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారిప్పుడు. 

 

అయితే ఎలక్షన్స్‌ ముగిశాయి కాబట్టి, మళ్లీ పవన్‌ సినిమాల్లోకి రానున్నాడనే ప్రచారం జరుగుతోంది. చేయాల్సిన కమిట్మెంట్స్‌ కూడా చాలానే ఉన్నాయి పవన్‌ కళ్యాణ్‌కి. అయితే బండ్ల గణేష్‌ అడిగితే మాత్రం పవన్‌ తప్పకుండా సినిమా చేస్తాడని అంతా అనుకుంటున్నారు. అభిమానుల కోరిక కూడా అదే. అందుకే ఆ దిశగా బండ్ల గణేష్‌ కూడా పావులు కదుపుతున్నాడట. తన దేవుడితో ఓ సినిమా తీసి, హిట్‌ కొట్టాలనుకుంటున్నాడట. మరి తన వీర భక్తుడి కోరికను పవన్‌ కళ్యాణ్‌ మన్నిస్తాడా.? చూడాలిక. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS