సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ 'టైగర్ కేసీఆర్' పేరుతో బయోపిక్‌ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌పై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. కేసీఆర్‌కి వ్యతిరేకంగా ఈ బయోపిక్ ఉంటుందనీ, కాదు, కాదు, ఆంధ్రోళ్లకు వ్యతిరేకంగా ఉంటుందనీ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై వర్మ తాజాగా స్పందించారు.
ఈ సినిమా ఆంధ్రోళ్లకు వ్యతిరేకంగా ఉండదనీ, తెలంగాణా ప్రజలను అవమానపరిచిన కొంతమంది ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా మాత్రమే ఉండబోతోందనీ స్పష్టం చేశారు. తెలుగు ప్రజలంటే కేసీఆర్‌కి ఎంతో ఇష్టమనీ, ఆయన యుద్ధం తెలంగాణా ప్రజలను వెన్నుపోటు పొడిచిన కొంతమంది ఆంధ్ర నాయకులపై మాత్రమే అని వర్మ చెప్పుకొచ్చారు. అయితే మొన్న విడుదల చేసిన వర్మ వీడియో మాత్రం ఆంధ్రోళ్లకు వ్యతిరేకంగా 'టైగర్ కేసీఆర్' ఉండబోతోందని ప్రూవ్ చేసింది.
'నీ తాట తీయడానికే వస్తున్నా.. 'ఆంధ్రోడా'..' అంటూ వర్మ పాట రూపంలో విడుదల చేసిన ఈ వీడియో ఆంధ్రుల మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉండడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలకు స్పందించిన వర్మ ఈ తాజా పోస్ట్ పెట్టి, మరోసారి అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఇంతకీ వర్మ 'టైగర్ కేసీఆర్' ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు.? ఏం చూపించబోతున్నారో చూడాలి మరి.