గ్లామ్‌షాట్‌: బ్లాక్‌ హాట్‌ 'జెర్సీ' ఎక్స్‌ప్రెషన్‌.!

By iQlikMovies - April 23, 2019 - 10:27 AM IST

మరిన్ని వార్తలు

'నా పేరు శ్రద్ధా శ్రీనాధ్‌' అని ఒకటికి పదిసార్లు కాన్ఫిడెంట్‌గా చెప్పి, హిట్‌ కొట్టింది జెర్సీ భామ శ్రద్ధా శ్రీనాధ్‌. అన్ని సార్లు చెప్పిన తర్వాత మర్చిపోవడమన్నది సాధ్యం కాదు, ఇక 'జెర్సీ'లో అమ్మడి పర్‌ఫామెన్స్‌ చూసిన తర్వాత అస్సలు సాధ్యమే కాలేదు ఆడియన్స్‌కి. అమ్మడు చెప్పిందంతా నిజమే.. అని మదిలో రిజిస్టర్‌ చేసేసుకున్నారు. 'జెర్సీ' ఇంతటి ఘన విజయం సాధించినందుకు అభిమానులందరికీ థాంక్స్‌ చెప్పింది. 

 

'జెర్సీ' సక్సెస్‌ మీట్‌లో ఇదిగో ఇలా బ్లాక్‌ హాట్‌ కాస్ట్యూమ్‌లో కనిపించి అందర్నీ ఎట్రాక్ట్‌ చేసింది. టాలెంట్‌ ఉంది. ఎక్స్‌పోజింగ్‌లో మొహమాటాల్లేవ్‌. తెలుగులోనూ చక్కగా మాట్లాడేస్తోంది. సో అందరి దృష్టీ ఇప్పుడు 'జెర్సీ' భామ పైనే. అవకాశాలు బాగానే పోటెత్తుతున్నాయట. త్వరలోనే స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకునే దిశగా అమ్మడి ఆటిట్యూడ్‌ పరుగులు పెడుతోంది మరి. చూడాలి శ్రద్ధా చెప్పినట్లే, భవిష్యత్తులో టాలీవుడ్‌లో ఆమె పేరు మార్మోగిపోతుందేమో. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS