భారీగా విడుదల కానున్న సూర్య బందోబస్త్!

మరిన్ని వార్తలు

'ఎన్.జి.కె' లాంటి పొలిటికల్ థ్రిల్లర్ తరువాత హీరో 'సూర్య' నటించిన తాజా చిత్రం 'కాప్పాన్' తెలుగు లో 'బందోబస్త్' ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'రోబో 2.ఓ', 'ఇండియన్ 2' వంటి భారీ చిత్రాలను తెరకెక్కిస్తున్న 'లైకా ప్రొడక్షన్స్' సంస్థ నిర్మించిన ఈ చిత్రం లో సూర్య తో పాటు మలయాళం సూపర్ స్టార్ 'మోహన్ లాల్', తమిళ నటుడు 'ఆర్య' మరియు 'అఖిల్' చిత్రం తో ఎంట్రీ ఇచ్చిన 'సయేశా' కూడా నటిస్తున్నారు. 'వీడోక్కడే', 'రంగం' లాంటి యాక్షన్ సినిమాలను తెరకెక్కించిన 'కెవి ఆనంద్' ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

 

సెప్టెంబర్ 20న 'వాల్మీకి' చిత్రానికి పోటీగా 'ఎన్.వి ప్రసాద్' ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేయనున్నాడు. నైజం లో 'దిల్ రాజు' ఆంధ్ర లో 'సురేష్ బాబు' మరియు 'సీడెడ్' లో ఎన్.వి ప్రసాద్ స్వయంగా ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. ఇంచు మించు స్ట్రెయిట్ తెలుగు సినిమా లాగ ఈ చిత్రాన్ని ఇంత భారీగా విడుదల చేయడం విశేషం. సంవత్సరం పాటు సుదీర్ఘమైన రీసర్చ్ తో ఈ కథను సిద్ధం చేసాడు దర్శకుడు..కథలో అంతర్లీనంగా పలు కథనాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి అని సమాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS