ఈ సంక్రాంతికి వస్తాయనుకున్న ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్‌లు వాయిదా పడడంతో.. `బంగార్రాజు`నే పెద్ద సినిమా అయిపోయింది. ఈనెల 14న వస్తున్న బంగార్రాజుపై అందరి కళ్లూ పడ్డాయి. నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన చిత్రమిది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సోగ్గాడే చిన్ని నాయిన సూపర్ హిట్ కావడంతో, సంక్రాంతి సెంటిమెంట్ రిపీట్ అవుతుండడంతో.. ఈ సినిమాపై బయ్యర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. దాంతో బిజినెస్ కూడా రికార్డ్ స్థాయిలో జరిగింది.
ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా రూ.39 కోట్లకు అమ్మేశారు. నాగ్ కెరీర్‌లో ఇదే రికార్డ్. నాగ్ వరుస పరాజయాలలో ఉన్నా సరే, సోగ్గాడే చిన్ని నాయిన కు ఉన్న రిపిటీషన్ వల్ల ఈ స్థాయిలో బిజినెస్ జరిగింది. నైజాంలో అత్యధికంగా ఈ సినిమా 11 కోట్లకు అమ్ముడుపోయింది. సీడెడ్ లో రూ.6 కోట్లు వచ్చాయి. ఉత్తరాంధ్రలో 4.5 కోట్లు, గుంటూరులో 3 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్ నుంచి... 2.5 కోట్లు వచ్చాయి. థర్డ్ వేవ్ భయాల వల్ల బిజినెస్ కాస్త తగ్గింది గానీ, లేదంటే రూ.50 కోట్ల మార్క్ ని ఈజీగా దాటేసేది. ఈ సినిమాకి ఏమాత్రం పాజిటీవ్ బజ్ వచ్చినా... ఈ సీజన్‌లో బాక్సాఫీసు నుంచి 50 కోట్లు వసూలు చేయడం ఖాయం.