సోగ్గాడే చిన్ని నాయినకి ప్రీక్వెల్ గా రూపొందిన చిత్రం `బంగార్రాజు`. ఈ సినిమా సంక్రాంతి రేసులో ఉంది. అయితే రిలీజ్ డేట్ ఇప్పటి వరకూ ప్రకటించలేదు. మరోవైపు ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేస్తారని, పే ఫర్ వ్యూ పద్ధతిన చూసే అవకాశం ఉందని వార్తలొచ్చాయి. ఓ సినిమా థియేటర్, నాన్ థియేటర్ రైట్స్ జీ సంస్థ దక్కించుకుంది. సంక్రాంతికి జీ 5 ఓటీటీలో ఈ సినిమా వస్తుందని ప్రచారం జరుగుతోంది. వీటిపై... నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.
``ఈ సినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ థియేటర్లలోనే విడుదల చేస్తాం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం`` అని చిత్రబృందం స్పష్టం చేసింది. జనవరి 12న గానీ, జనవరి 14 న గానీ ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సంక్రాంతికి రాధే శ్యామ్, ఆర్.ఆర్.ఆర్ విడుదల అవుతాయని అనుకున్నారు. అయితే ఆ రెండు సినిమాలూ వాయిదా పడడంతో.. ఈ సంక్రాంతికి బంగార్రాజే పెద్ద సినిమా అయి కూర్చుంది. మరి ఈసారి నాగ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.