నందమూరి బాలకృష్ణకు హిట్టు పడి చాలా కాలం అయ్యింది. ఆయన మాస్ పవర్ చూసి కూడా చాణ్ణాళ్లయ్యింది. అందుకే బోయపాటితో బాలయ్య సినిమా అనగానే అభిమానులు ఖుషీ అయ్యారు. బాలయ్యని ఫ్యాన్స్ మెచ్చేలా చూపించగలిగే దమ్ము... ఆ సత్తా ఉన్నది ఈరోజుల్లో బోయపాటికే.
బోయపాటి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం ఒమ్ము చేయలేదు. తన కొత్త సినిమా టీజర్ తో అభిమానుల్ని మెప్పించేశాడు. మరోసారి వాళ్ల మనసుల్ని గెలుచుకున్నాడు. బాలయ్య - బోయపాటి సినిమా టీజర్ మంగళవారం రాత్రి విడుదలైంది. బాలయ్య గెటప్, డైలాగులు, ఆ రాజసం.. చూస్తుంటే సింహా, లెజెండ్ సినిమాల్ని కలిపి చూస్తున్న ఫీలింగ్ కలిగింది అభిమానులకు. ఈసారి బాక్సాఫీసు దగ్గర తొడ గొట్టడం ఖామమని వాళ్లకు నమ్మకాలు వచ్చేశాయి. `మా బాలయ్యని చూపించాలంటే మీ తరవాతే ఎవరైనా` అంటూ బోయపాటికి ఫ్యాన్స్ కితాబులు కూడా ఇచ్చేస్తున్నారు.
ఈ సినిమా టైటిల్ ఏమిటన్నది ఇంత వరకూ తేలలేదు. `మోనార్క్` అనే పేరు పరిశీలనకు వచ్చినా, అది కాదని తేలిపోయింది. మరి కొత్త టైటిల్ ఎప్పుడు చెబుతారో? అది కూడా చెప్పేస్తే.. ఫ్యాన్స్ మరింత హ్యాపీ అవుతారు.