సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అగస్థ్య మంజు దర్శకుడిగా 'బ్యూటిఫుల్' అనే చిత్రం తెరకెక్కుతోంది. లేటెస్ట్‌గా ఈ సినిమా నుండి ఓ రొమాంటిక్ సాంగ్ వీడియో వదిలారు. బీచ్ బ్యాక్ గ్రౌండ్‌లో సాగే సాంగ్ ఇది. ప్రముఖ పాటల రచయిత సిరాశ్రీ అందించిన సాంగ్ లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక విజువల్ విషయానికి వస్తే, బీచ్ సాంగ్ కాబట్టి, రొమాంటిక్ ఫీల్ అదిరిపోయింది. క్లోజప్‌లో గాఢమైన లిప్ లాక్‌లు, బికినీ సోయగాలు.. కళాపోషకులకు శృంగార స్వర్గాన్ని చూపించేశాయి.
హీరో, హీరోయిన్ పార్ధ్ సూరి, నైనా గంగూలీ మధ్య ఓ రేంజ్‌లో కెమిస్ట్రీ పండింది సాంగ్‌లో. హీరోయిన్ జమ్నాస్టిక్ ఫీట్స్ చూస్తే, నాటి వర్మగారి హీరోయిన్ ఊర్మిళ నటించిన రంగేలీ చిత్రం గుర్తొచ్చేసింది. అందాలారబోత కూడా అదే రేంజ్‌లో కాదు అంతకు మించిన రేంజ్‌లో ఉంది. పాపం అస్సలు మొహమాటపడలేదు పిల్ల. 'రా..కెరటంలా నను ముంచెయ్, రా.. కసి కసిగా.. నను నలిపెయ్..' అంటూ మొదలైన లిరిక్స్ ఆధ్యంతం ఆసక్తిగా, రవిశంకర్ అందించిన మ్యూజిక్ బాణీలు వినసొంపుగా అనిపించాయి. ఇకపోతే, డైరెక్టర్ అగస్థ్య మంజు గతంలో వర్మగారు తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్‌లోనూ దర్శకత్వ భాగస్వామ్యం వహించిన సంగతి తెలిసిందే.