'స్టార్ట్ మ్యూజిక్ రీ లోడెడ్.. నేను పాడిస్తాను, నేను ఆడిస్తాను, నేను నవ్విస్తాను.. నేను కవ్విస్తాను..' అంటోంది శ్రీముఖి. బుల్లితెరపై శ్రీముఖి ఓ ప్రభంజనం. బుల్లితెర రాములమ్మగా బోలెడంత క్రేజ్ ఉంది శ్రీముఖికి. అయితే, బిగ్‌బాస్ సీజన్ 3 రియాల్టీ షో ద్వారా శ్రీముఖి పట్ల కొంత వ్యతిరేకత నెలకొన్న మాట వాస్తవమే. బిగ్‌బాస్ విన్నర్‌గా నిలుస్తుందనుకున్న శ్రీముఖి తన ఆటిట్యూడ్‌తో రన్నరప్‌గా నిలిచింది.
ఇక బిగ్‌బాస్ కారణంగా మోస్ట్ బిజీయెస్ట్ అయిన శ్రీముఖి చాలా షోలు చేసే అవకాశాలు కోల్పోయింది. కానీ, బిగ్‌బాస్ కారణంగానే బుల్లితెర నుండి వెండితెరకు ప్రమోట్ కానుంది శ్రీముఖి. శ్రీముఖి హీరోయిన్‌గా రెండు మూడు సినిమాలకు సైన్ చేసిందట. ఒక సినిమా ఛాన్స్ బిగ్‌బాస్‌లో ఉండగానే శ్రీముఖిని వరించిందట. ఈ సంగతి అటుంచితే, ఓ టెలివిజన్ ఛానెల్‌లో శ్రీముఖి సరికొత్తగా రీ ఎంటీ ఇస్తోంది. 'స్టార్ మ్యూజిక్ రీ లోడెడ్.. సెలబ్రేషన్ విత్ సెలబ్రిటీ మ్యూజిక్' అంటూ త్వరలో ఓ ప్రోగ్రామ్ బుల్లితెరపై సందడి చేయనుంది.
ఆ ప్రోగ్రామ్‌కి మన రాములమ్మ యాంకరింగ్ చేయబోతోందన్న మాట. ఈ ప్రోగ్రామ్ ప్రోమోని చాలా స్టైలిష్‌గా డిజైన్ చేశారు. స్టైలిష్ గెటప్‌లో శ్రీముఖి మైక్ పట్టుకుని చిందేస్తూ కనిపించింది. అంటే త్వరలోనే మన రాములమ్మ, న్యూ లుక్స్‌తో బుల్లితెరపై సందడి చేయనుందన్న మాట.