జబర్దస్త్‌కి నాగబాబు గుడ్‌ బై: కారణాలివే.!

మరిన్ని వార్తలు

జబర్దస్త్‌ షోకి నాగబాబు గుడ్‌ బై చెప్పేసినట్లే. అధికారికంగా ఆయనే కన్‌ఫామ్‌ చేసేశారు. 'జబర్దస్త్‌తో నా ప్రయాణం చాలా లాంగ్‌ అండ్‌ ఎమోషన్‌తో కూడుకున్నది. 2013 ఫిబ్రవరి నుండి 2019 నవంబర్‌ వరకూ జబర్దస్త్‌లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగాను. ఒక షోలో ఇన్నేళ్లు కొనసాగడం అన్నది చిన్న విషయం కాదు.. అయినా నా అంతట నేనుగా జబర్దస్త్‌ జర్నీని ఎండ్‌ చేస్తానని అనుకోలేదు. కానీ, ఏ జర్నీ అయినా ఏదో ఒక చోట ఎండ్‌ అవ్వాలి కదా.. ఇక్కడితో నా జబర్దస్త్‌ జర్నీ ఎండ్‌ అయిపోయిందని భావిస్తున్నాను. కొన్ని బిజినెస్‌ పరమైన ఐడియాలాజికల్‌ కారణాలతో జబర్దస్త్‌ నుండి తప్పుకోవల్సి వస్తోంది..' అని నాగబాబు తెలిపారు.

 

అయితే, రెమ్యునరేషన్‌ కారణంగా జబర్దస్త్‌ నుండి నాగబాబు తప్పుకున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన కన్‌ఫామ్‌ చేశారు. 'రెమ్యునరేషన్‌ అనేది అస్సలు ప్రామాణికం కాదనీ, అయినా, నా స్థాయికి తగ్గ రెమ్యునరేషన్‌ జబర్దస్త్‌ నుండి పొందడం లేదనీ..' ఆయన తెలిపారు. అయితే, జబర్దస్త్‌ నుండి నాగబాబు తప్పుకోవడానికి మరింకేదో బలమైన కారణాలు లేకపోలేదని ఆయన మాటల ద్వారా అర్ధమవుతోంది. ఆ కారణాలేంటో, మెల్ల మెల్లగా ముందు ముందు చెబుతారట. ఈ మాటలన్నీ ఆయన ఓన్‌ ఛానెల్‌ 'నా ఛానెల్‌ నా ఇష్టం' ద్వారా అభిమానులతో పంచుకున్నారు నాగబాబు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS