గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్ కె.కృష్ణ తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశి నిర్మాత. తాజాగా ఈ సినిమా టీజర్ విదుదలైయింది. జీవితం, ప్రేమ, పెళ్లి.. వంటి అంశాల మధ్య స్వాతిముత్యం లాంటి ఓ కుర్రాడి కథని ఈ టీజర్ చూస్తే అర్ధమౌతుంది. వినోదం, కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు కూడా టీజర్ లో కనిపించాయి.
''మీరు ఇప్పటికీ సింగల్ గానే ఎందుకున్నారో అర్దమైయింది''అని వర్ష బొల్లమ్మ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. గణేష్ బెల్లంకొండ పక్కింటి కుర్రాడిలా కనిపించాడు. రావు రమేష్ పాత్ర ఇందులో కీలకమని టీజర్ చూస్తేఅర్ధమౌతుంది. మహతి స్వర సాగర్ ఇచ్చిన నేపధ్య సంగీతం డీసెంట్ గా వుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వచ్చి చాలా కాలమైయింది. ‘స్వాతిముత్యం’ టీజర్ చూస్తుంటే ఫ్యామిలీ వినోదాలు అందించే సినిమానే నమ్మకాన్ని ఇస్తోంది. అక్టోబర్ 5 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.