టాలీవుడ్ లో `ఛత్రపతి` సృష్టించిన సంచలం అంతా ఇంతా కాదు. ప్రభాస్ - రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం.. మంచి విజయాన్ని సాధించడమే కాదు, మాస్ పవర్ ఏమిటో కూడా చూపించింది. ఛత్రపతి తరవాత.. ఆ స్థాయి మాస్‌సినిమాలో ప్రభాస్ నటించలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదేమో. ఆ సినిమాతోనే ప్రభాస్ ఇమేజ్ మరో పదింతలు పెరిగింది. ఈ సినిమా వచ్చిన పదిహేనేళ్లకు ... హిందీలో రీమేక్ చేయడానికి చూస్తున్నారు. ఓ ప్రముఖ బాలీవుడ్ సంస్థ `చత్రపతి` హక్కుల్ని కొనుగోలు చేసింది.
ఈ సినిమాని బెల్లంకొండ శ్రీనివాస్‌తో తీయాలని డిసైడ్ అయ్యింది. బెల్లంకొండకు హిందీలో మంచి మార్కెట్ వుంది. తన సినిమాలన్నీ హిందీలో విరివిగా డబ్ అవుతాయి. డబ్బింగ్ రూపంలో బెల్లంకొండకు మంచి రేట్లు కూడా వస్తున్నాయి. అందుకే ఎప్పటి నుంచో నేరుగా ఓ హిందీ సినిమా చేయాలన్నది తన ఆశ. ఇంతకాలానికి `ఛత్రపతి` రూపంలో వచ్చింది. ఈ బాలీవుడ్ ఛత్రపతిని హ్యాండిల్ చేసే దర్శకుడు ఎవరన్నదీ తేలాలి. బహుశా.. ఆ దర్శకుడు సైతం టాలీవుడ్ నుంచే ఉండొచ్చని టాక్.