బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ డబ్బింగులకు మంచి డిమాండ్ ఉంది. నార్త్ లో తన సినిమాలు బాగా చూస్తారు. అందుకే బెల్లంకొండ సినిమా హిందీ వెర్షన్లు రికార్డు వ్యూస్ సంపాదించుకుంటాయి. ఈ ఇమేజ్ చూసే.. బెల్లంకొండని హిందీలో లాంచ్ చేయడానికి నిర్మాతలు ముందుకొచ్చారు. `ఛత్రపతి` రీమేక్.. వినాయక్ దర్శకుడు... ఇలా.. హిందీలో లాంచ్ ని గట్టిగానే సెట్ చేసుకున్నాడు బెల్లంకొండ. అల్లుడు అదుర్స్ అయిన వెంటనే.. `ఛత్రపతి` రీమేక్ పట్టాలెక్కాలి. కానీ ఇంత వరకూ.. చడీ చప్పుడు లేదు.
ఇప్పుడు ధనుష్ తమిళ సినిమా `కర్ణన్`ని బెల్లంకొండ రీమేక్ చేస్తున్నాడన్న వార్తలొస్తున్నాయి. దాంతో `ఛత్రపతి` ఉంటుందా, లేదా? అనే డౌట్లు పుట్టుకొచ్చాయి. నిజానికి ఈనెల 25న హైదరాబాద్ లో.. `ఛత్రపతి` రీమేక్ మొదలు కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా ఆగిపోయింది. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో ఓ పెద్ద సెట్ వేశారు. అక్కడ కీలకమైన షెడ్యూల్ జరగాలి. అది ఇప్పుడు వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడిన తరవాత.. `చత్రపతి` సెట్లోకి బెల్లంకొండ అడుగుపెడతాడు. ధనుష్ రీమేక్ సినిమా రైట్స్ ని బెల్లంకొండ సొంతం చేసుకున్న మాట నిజమే. అయితే ఆ సినిమా `చత్రపతి` రీమేక్ పూర్తయిన తరవాతే పట్టాలెక్కుతుందని టాక్.