ఇప్పుడు మోసాలకు కొత్త రూపు వచ్చింది. అంతా ఆన్ లైన్‌లోనే. ఓ ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేయడం.. `నేను ఫలానా. నాకు డబ్బులు అర్జెంటుగా పంపు` అని రిక్వెస్ట్ లు పంపడం మామూలైపోయింది. ఇంకొంతమంది సెలబ్రెటీల పేర్లు వాడుకుంటున్నారు. ఏకంగా.. ఫోన్లో మెసేజీలు పంపి.. డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ పేరు కూడా ఇలా మోసగాళ్లకు అడ్డాగా మారింది. తేజూ సన్నిహితులు కొంతమందికి... ఓ వ్యక్తి మెసేజీలు పంపుతున్నాడట.
తేజు పేరు చెప్పి డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నాడట. ఈ విషయం తేజూకి తెలిసింది. వెంటనే అలెర్ట్ అయిపోయాడు. తన పేరు చెప్పి, ఎవరైనా డబ్బులు అడిగితే.. ఇవ్వొద్దనికోరాడు. ఈ విషయమై.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటున్నాడు తేజూ. తన పేరుతో జరుగుతున్న మోసాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు. ఇలాంటి మోసగాళ్ల మాయలో పడొద్దని తన అభిమానుల్ని, సన్నిహితుల్నీ కోరుతున్నాడు.