బెల్లంకొండ 'కవచం' అదిరింది.!

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ తాజా చిత్రం 'కవచం'. లేటెస్టుగా ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించారు. కొత్త డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కాజల్‌ అగర్వాల్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌కి జోడీగా నటిస్తోంది. టైటిల్‌తో పాటు విడుదల చేసిన పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. బెల్లంకొండ శ్రీనివాస్‌ పోలీస్‌ గెటప్‌లో ఉన్న పోస్టర్‌ అది. 

పోలీస్‌ గెటప్‌లో బెల్లంకొండ తొలిసారి నటిస్తున్నాడు. ఆరడుగుల కటౌట్‌ పోలీస్‌ గెటప్‌లో చాలా చాలా బాగున్నాడు. పోస్టర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇటీవల 'సాక్ష్యం' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బెల్లంకొండ ఆశించిన స్థాయిలో శాటిస్‌ఫై చేయలేకపోయాడు. అయితే పోలీస్‌ గెటప్‌లో బెల్లంకొండ నటిస్తున్న 'కవచం'తో ఎలాంటి సక్సెస్‌ అందుకుంటాడో చూడాలి మరి. టైటిల్‌కీ, పోస్టర్‌కీ వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే, సినిమాలో ఏదో విషయం ఉందనే అనిపిస్తోంది. అన్నట్లు ఈ సినిమాలో మరో ముద్దుగుమ్మ మెహ్రీన్‌ కౌర్‌ కూడా నటిస్తోంది. 

నీల్‌ నితిన్‌ ముఖేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం డిశంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు బెల్లంకొండ ఇది కాక మరో చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా చందమామే హీరోయిన్‌గా నటిస్తోంది. 

క్రియేటివ్‌ డైరెక్టర్‌ తేజ ఈ చిత్రానికి దర్శకుడు, ఆల్రెడీ షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌నీ త్వరలోనే అనౌన్స్‌ చేయనున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS