వినయ విధేయ రామ్‌ 'కొ.ణి.దె.ల'.!

మరిన్ని వార్తలు

పేరులో విధేయత ఉంది. కానీ మాస్‌ పక్కా మాస్‌. ఎవడైతే నాకేంటీ.? నేను రామ్‌ కొ.ణి.దె.ల.. అంటున్నాడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌. అవును రామ్‌చరణ్‌ నటిస్తున్న 'వినయ విధేయ రామ' చిత్రం టీజర్‌ విడుదలైంది. 

బోయపాటి మార్క్‌ పక్కాగా కనిపిస్తోంది టీజర్‌లో. పక్కా మాస్‌ అండ్‌ యాక్షన్‌ ప్యాక్‌డ్‌ మూవీ అని మొదట్నుంచీ చెప్పుకొస్తున్నారు. ఫస్ట్‌లుక్‌నీ అదే యాంగిల్‌లో చూపించారు. ఇప్పుడు టీజర్‌ కూడా పవర్‌ఫుల్‌ యాక్షన్‌తో కట్‌ చేశారు. కట్‌ చేస్తే చరణ్‌ పేరు సినిమాలో 'కొణిదెల రామ్‌'. చాలా ఈజ్‌తో, సూపర్బ్‌ బాడీ లాంగ్వేజ్‌తో వినయ విధేయ రాముడు 'నేను మాస్‌.. సూపర్‌ మాస్‌.. ఊర మాస్‌' అనే తరహాలో కన్పిస్తున్నాడు. 

టీజర్‌ కోసం ఉత్కంఠగా ఎదురు చూసిన అభిమానులకి బోయపాటి, రామ్‌ తమదైన స్టయిల్లో స్వీట్‌ షాక్‌ ఇచ్చారు. ఎందుకంటే టైటిల్‌ చాలా సాఫ్ట్‌.. టీజర్‌ కూడా అలాగే వస్తుందని అభిమానుల్లో కొందరు ఊహించారు. తెల్లటి పంచెతో.. నీట్‌గా క్యూట్‌గా చరణ్‌ ఫస్ట్‌ లుక్‌లోనే దర్శనమిస్తాడని గాసిప్స్‌ వచ్చాయి. అదంతా ఉత్తదేనని తేలిపోయింది. ఫస్ట్‌ లుక్‌లోనే మాస్‌ యాంగిల్‌ చూపించిన 'వినయ విధేయ రాముడు', టీజర్‌లోనూ అదే మాస్‌ లుక్‌తో అదరగొట్టేశాడు. 

చరణ్‌కి మాస్‌ సినిమాలు కొత్తేమీ కాదు. అయితే ఈ మధ్య కొంత ప్రయోగాల బాట పట్టాడు. జస్ట్‌ ఫర్‌ ఏ ఛేంజ్‌, మళ్ళీ మాంఛి మాస్‌ కమర్షియల్‌ సినిమాతో 2019 సంక్రాంతికి హల్‌చల్‌ చేయబోతున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS