బెల్లంకొండ‌ని ముంచేసిన హిందీ మార్కెట్

మరిన్ని వార్తలు

హిందీ శాటిలైట్ తెలుగు నిర్మాత‌ల‌కు వ‌రంగా మారింది. తెలుగులో రూపొందిన మాస్‌, యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమాల‌కు హిందీలో భ‌లే గిరాకీ. మ‌న తెలుగు సినిమాల్ని హిందీలో డ‌బ్ చేసి, టీవీల్లో వ‌దులుతుంటారు. నార్త్‌లో ఇలాంటి సినిమాల్ని బాగా చూస్తారు. అందుకే.. హిందీ డ‌బ్బింగ్ రూపంలో మ‌న‌వాళ్ల‌కు క‌నీవినీ ఎరుగ‌ని రేట్లు ప‌లుకుతున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌కి హిందీలో మంచి మార్కెట్ ఉంది. తెలుగు శాటిలైట్ కంటే, హిందీ శాటిలైట్ రూపంలో ఎక్కువ డ‌బ్బులొస్తాయి. క‌నీసం హిందీ నుంచి బెల్లంకొండ కు 10 నుంచి 12 కోట్లు వ‌స్తాయి. స‌గం పెట్టుబ‌డి హిందీ శాటిలైట్ నుంచి ద‌క్కించుకుంటున్న ఏకైక హీరో బెల్లంకొండ‌.

 

అయితే... తాజాగా హిందీ శాటిలైట్ మార్కెట్ బాగా డ‌ల్ అయిపోయింది. తెలుగు సినిమాల్ని ఆచి తూచి కొంటున్నారు. దానికి తోడు ఈమ‌ధ్య బెల్లంకొండ‌కు స‌రైన హిట్టు లేదు. అందుకే త‌న‌కీ హిందీ మార్కెట్ బాగా డ‌ల్ అయ్యింది. ప్ర‌స్తుతం సంతోష్ శ్రీ‌వాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ‌. ఆ సినిమా హిందీ బిజినెస్ ఇంకా పూర్తి కాలేదు. ఎలాగూ బెల్లంకొండ‌కు హిందీలో బాగా మార్కెట్ ఉంది క‌దా, అక్క‌డి నుంచి క‌నీసం 12 కోట్లు వ‌స్తాయి క‌దా అని ఈ సినిమాపై ఎడా పెడా ఖ‌ర్చు పెట్టారు. తీరా చూస్తే... హిందీ శాటిలైట్ అవ్వ‌డం లేద‌ట‌. బెల్లంకొండ సినిమాని 7 లేదా 8 కోట్ల‌కు మించి కొనం అని చెబుతున్నార్ట‌. దాంతో.. హిందీ పై ఆశ‌లు పెట్టుకున్న నిర్మాత బాగా డ‌ల్ అయిపోయిన‌ట్టు స‌మాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS