ఒక్క ఫోటోతో వివాదంలోకి బెల్లంకొండ హీరో

By iQlikMovies - September 25, 2018 - 19:01 PM IST

మరిన్ని వార్తలు

కొన్ని కొన్ని సార్లు మనం చేసే పనులు మనల్ని వివాదాల్లోకి నేట్టేస్తుంటాయి. ఇదే కోవలో తాజాగా యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఒక వివాదంలో ఇరుక్కున్నాడు.

ఆ వివరాల్లోకి వెళితే, బెల్లంకొండ శ్రీనివాస్ తన చిత్ర షూటింగ్ కోసం థాయిలాండ్ లో షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆ షూటింగ్ లో భాగంగా ఒక ఏనుగు దంతాల పైన కూర్చుని ఒక ఫోటో తీసుకున్నాడు, ఆ ఫోటో తీసుకోవడమే కాకుండా దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  

 

ఈ ఫోటోకి లైక్స్ కన్నా విమర్శలు ఎక్కువగా రావడంతో వెంటనే ఆ ఫోటోని డిలీట్ చేసేశాడు. ఇక ఈ ఫోటో వల్ల సోషల్ మీడియాలో బెల్లంకొండ శ్రీనివాస్ ట్రోలింగ్ బారిన పడుతున్నాడు. మరికొంతమంది జంతు ప్రేమికులు మాత్రం ఇది చట్టరీత్యానేరం అని అంటున్నవారు లేకపోలేదు.

ఏదేమైనా... బెల్లంకొండ హీరోకి అనవసరంగా ఈ సమస్య మెడకి చుట్టుకుంది అని అందరూ అనుకుంటున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS