ఇద్దరు పిల్లల తండ్రిగా నాగ్‌.?

మరిన్ని వార్తలు

రీల్‌ లైఫ్‌లో నాగార్జున ఇంకా పాతికేళ్ల కుర్రాడే కానీ, రియల్‌ లైఫ్‌లో ఇద్దరు కుర్రోళ్లకు తండ్రి. రేపో మాపో కాబోయే తాతగారు కూడా. అయినా తెరపై ఆయన పాతికేళ్ల కర్రాడిగానే కనిపిస్తారు. ఏ టెన్షన్స్‌ లేకుండా, ప్రశాంతంగా ఉండడమే తన గ్లామర్‌ రహస్యం అని ఎప్పుడూ నాగ్‌ చెబుతున్నా, అసలు సిసలు సీక్రెట్‌ ఏంటో ఆయనకు తప్ప మరెవ్వరికీ తెలియదంతే. 

ఇకపోతే ప్రయోగాలంటే నాగార్జున ఎప్పుడూ ముందుంటాడు. పాతికేళ్ల కుర్రతనమే కాదు, అరవై ఏళ్ల ముసలితనం చూపించడానికైనా సిద్ధమే. అందుకే ఆయన నుండి 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' తదితర విభిన్న కథా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే రీల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌లో నాగార్జున కనిపిస్తాడా? అనే ప్రశ్న ఆయన్ని అడిగితే, నో డౌట్‌ ఎందుకు కనిపించను అని సింపుల్‌గా సమాధానమిచ్చేశారు నాగార్జున. 

ప్రస్తుతం నాగార్జున, నానితో కలిసి చేస్తున్న మల్టీస్టారర్‌ 'దేవదాస్‌' విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు. అలాగే బాలీవుడ్‌లో బిగ్‌బీ అమితాబ్‌ నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళ హీరో ధనుష్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ భారీ బడ్జెట్‌ చిత్రంలోనూ నాగార్జున నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున పాత్ర విలక్షణంగా ఉంటుందట. ఇంతవరకూ ఇలాంటి పాత్రలో నాగార్జున కనిపించింది లేదంట. చిన్న పాత్రే అయినా సినిమాకి ఈ పాత్ర ఎంతో కీలకమట. 

ఓ పక్క తెలుగులో యాక్టివ్‌గా సినిమాలు చేస్తూనే మరో వైపు హిందీలోనూ, తమిళంలోనూ కూడా నాగార్జున జోరు ప్రదర్శిస్తున్నారు. దటీజ్‌ నాగార్జున.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS