బొమ్మతో భయపెట్టేసిన బెల్లంబాబు.!

By Inkmantra - April 05, 2019 - 17:36 PM IST

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తాజాగా ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ 'రాట్ససన్‌'కి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రీ లుక్‌ని ఉగాది సందర్భంగా రిలీజ్‌ చేశారు. లుక్‌ చూసి ఆడియన్స్‌ కాసేపు షాక్‌లోకి వెళ్లిపోయారు. అంత భయంకరంగా ఉంది ఆ లుక్‌. నిజానికి లుక్‌లో ఏం లేదు. చిన్నపిల్లలు ఆడుకునే ఓ బార్బీ బొమ్మ తలకాయను జుట్టుతో వేలాడదీశారు. 

 

ఆ బొమ్మకి కళ్లు పీకేసి, ముఖం మీద చాలా చోట్ల కత్తి గాట్లు పెట్టి, భయంకరంగా డిజైన్‌ చేశారు ఆ బొమ్మని. బ్యాక్‌గ్రౌండ్‌లో గోడపై మర్డర్‌ కేసులకు సంబంధించిన కొన్ని పేపర్‌ క్లిప్పింగ్స్‌ ఉన్నాయి. టైటిల్‌ లోగో కింద ఓ కొత్త గిఫ్ట్‌ ఉంది. ఓ సీరియల్‌ కిల్లర్‌ చుట్టూ తిరిగే కథ ఈ రాక్షసన్‌ సినిమా స్టోరీ అని ఆల్రెడీ తెలిసింది. అందుకు తగ్గట్లుగానే ఈ ప్రీలుక్‌ని రిలీజ్‌ చేశారు. రేపు ఫస్ట్‌లుక్‌ విడుదల కానుంది. 

 

ఇంతవరకూ కమర్షియల్‌ బ్యాక్‌ డ్రాప్‌లోనే సినిమాల్ని ఎంచుకున్న బెల్లంకొండ ఈ సినిమాతో గేర్‌ మార్చాడు. కొత్త ఫార్మేట్‌ని ఎంచుకున్నాడు. నిజానికి బెల్లంకొండ నుండి ఈ తరహా సినిమాని ఎవరూ ఊహించి ఉండరు. ఏదిఏమైనా ఈ ప్రీలుక్‌తో బెల్లంకొండ భలే షాకిచ్చాడు. మరి రేపు రాబోయే ఆ ఫస్ట్‌లుక్‌ ఎలా ఉండబోతోందో చూడాలి మరి. 'రాక్షసుడు' అనే టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్‌ చేసిన సంగతి తెలిసిందే. రమేష్‌ వర్మ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS