ఈ సారి బంగార్రాజుకు కాబోయే 'సత్తెమ్మ' ఎవరో తెలుసా.!

By Inkmantra - April 05, 2019 - 14:30 PM IST

మరిన్ని వార్తలు

'బంగార్రాజు'గా 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో నాగార్జున మరోసారి అమ్మాయిల మనసుల్ని కొల్లగొట్టేశాడు. లేట్‌ వయసులోనూ తన హ్యాండ్‌సమ్‌ లుక్స్‌తో కట్టి పడేశాడు. అంతే అందంగా రమ్యకృష్ణ 'సత్యభామ' (సత్తెమ్మ)గా ఆకట్టుకుంది ఈ సినిమాలో. అయితే 'సోగ్గాడే చిన్నినాయనా' సీక్వెల్‌ తెరకెక్కిస్తానని నాగార్జున ఎప్పటి నుండో చెబుతూ వస్తున్నారు. 'బంగార్రాజు' అనే టైటిల్‌ని కూడా ఈ సినిమా కోసం రిజిస్టర్‌ చేయించి అట్టేపెట్టారు నాగ్‌. ఇక సెట్స్‌ మీదికి వెళ్లడమే తరువాయి. అందుకు సరైన ముహూర్తం కూడా ఫిక్స్‌ చేసేశారట. 

 

ఎలక్షన్స్‌ కంప్లీట్‌ కాగానే వన్‌ ఫైన్‌ డే ఈ సినిమాని పట్టాలెక్కించేయాలని అనుకుంటున్నారట. ఆల్రెడీ నాగార్జున 'మన్మధుడు 2'లో నటిస్తున్నారు. తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోందీ సినిమా. కాగా ఈ రెండు సినిమాలనూ సమాంతరంగా కంప్లీట్‌ చేయాలనే యోచనలో నాగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. 'మన్మధుడు 2'లో నాగ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌తో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేస్తున్నారు. ఇక 'బంగార్రాజు' కోసం ఏ ముద్దుగుమ్మని దించుతారో తెలియాల్సి ఉంది. 

 

అయితే సౌత్‌ క్వీన్‌ నయనతారను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నట్లుగా సమాచారమ్‌ అందుతోంది. మరోపక్క కొత్తభామల్లో క్రేజీ భామలెవరినైనా ఎంచుకునే యోచన కూడా చేస్తున్నారట నాగ్‌. వారిలో సెన్సేషనల్‌ హాట్‌ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ పేరు ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఈ భామ వెంకీమామలో వెంకీతో జోడీ కడుతోంది. ఛాన్స్‌ వస్తే మన్మధుడితోనూ జోడీకి దిగదా.? త్వరలోనే 'బంగార్రాజు' హీరోయిన్‌ విషయమై ఓ క్లారిటీ రానుందట. తొలి పార్ట్‌ తెరకెక్కించిన కళ్యాణ్‌ కృష్ణ ఈ సినిమాకీ దర్శకత్వం వహిస్తున్నాడు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS