రీమేక్ సినిమాలలో ఓ సౌలభ్యం ఉంటుంది. సన్నివేశాల్ని కొత్తగా రాసుకునే పనిలేదు. ఉన్నది ఉన్నట్టుగా తీస్తూ.. చిన్న పాటి మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అయితే.. ఈమధ్య దర్శకులు మక్కీకి మక్కీ అనే సూత్రం పాటిస్తున్నారు. ఎలాగూ అన్ని డబ్బులు పోసి కొన్నాం కదా అని సీన్ టూ సీన్ దింపేస్తున్నారు. ఇప్పుడు టైటిల్ కూడా కాపీ పేస్ట్ చేసేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - రమేష్ వర్మ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే.
తమిళంలో ఘన విజయం సాధించిన 'రాక్షసన్' చిత్రానికి ఇది రీమేక్. రాక్షసన్ అంటే తెలుగులో రాక్షసుడు అని అర్థం. ఇప్పుడు తెలుగు రీమేక్‌కి అదే టైటిల్ పెట్టారు. 'రాక్షసుడు' అంటూ నామకరణం చేశారు. కనీసం టైటిల్ విషయంలో కొత్తగా ఆలోచించని ఈ టీమ్.. ఈ సినిమాని ఎలా తీస్తుందో అర్థం చేసుకోవొచ్చు. ఇప్పటికే అరవై శాతం చిత్రీకరణ పూర్తయిపోయిందట. ఉగాదిన టైటిల్‌ని అధికారికంగా ప్రకటిస్తారు.