ఈ ఏడాది కొత్త భామలకు సీనియర్ భామలు గట్టి పోటీ ఇచ్చారు. సీనియర్స్‌లో ఈ ఏడాది హవా చూపించిన ముద్దుగుమ్మలు ముచ్చటగా ముగ్గురే ముగ్గురు. వారే సమంత, తమన్నా, కాజల్ అగర్వాల్. సమంత ఈ ఏడాది 'మజిలీ', 'ఓ బేబీ' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండూ సూపర్ హిట్స్ కావడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. సమంతను నటిగా నెక్స్‌ట్ లెవల్‌లో నిలబెట్టిన సినిమాలివి. ఇక తమన్నా విషయానికి వస్తే, 'ఎఫ్ 2'తో ఏడాదికి బోనీ కొట్టింది. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత 'సైరా నరసింహారెడ్డి'తో కెరీర్ బెస్ట్ హిట్‌ని ఈ ఏడాదిలోనే తమన్నా సొంతం చేసుకుంది.
'ఎఫ్ 2'తో గ్లామర్ క్వీన్‌లా, 'సైరా'తో పర్‌ఫామెన్స్ క్వీన్‌లా ఆకట్టుకున్న తమన్నా నటించిన 'క్వీన్' తెలుగు రీమేక్ 'దటీజ్ మహాలక్ష్మి' కూడా ఈ ఏడాదిలోనే విడుదల కావల్సి ఉంది. కానీ, ఆలస్యమవుతుంది. బహుశా వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ ఉండొచ్చునేమో. ఇక కాజల్ అగర్వాల్‌కి ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈ ఏడాది తెలుగు, తమిళ భాషలతో కలిపి ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. తెలుగులో 'సీత', 'రణరంగం' సినిమాల రిజల్ట్ కాజల్ అగర్వాల్‌కి బెడిసికొట్టాయి. తమిళ నాట విడుదలైన 'కోమలి' కూడా కాజల్‌ని మోసం చేసింది. టోటల్‌గా ఈ ఏడాది కాజల్‌కి బాగా దెబ్బయిపోయింది. సమంత, తమన్నా పేర్లు మార్మోగిపోయాయి.