'హిట్‌' సినిమా నుండి 'హీరో' వచ్చాడు.!

By Inkmantra - December 25, 2019 - 10:06 AM IST

మరిన్ని వార్తలు

నేచురల్‌ స్టార్‌ నాని సొంత బ్యానర్‌ అయిన వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌లో రూపొందుతోన్న తాజా సినిమా 'హిట్‌' సినిమా. టైటిల్‌తోనే అందరి నోటా 'హిట్‌' అనిపించుకున్న ఈ సినిమాలో 'ఫలక్‌నుమా దాస్‌' ఫేం విశ్వక్సేన్‌ హీరోగా నటిస్తున్నాడు. 'చిలసౌ' బ్యూటీ రుహానీ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. క్రిస్‌మస్‌ సందర్భంగా ఈ సినిమాలో హీరో పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు. ఇంటెన్సింగ్‌ లుక్స్‌లో కనిపిస్తున్న హీరో పాత్ర పేరును 'విక్రమ్‌ రుద్రరాజు' గా పరిచయం చేశారు. 'ఈయన విక్రమ్‌ రుద్రరాజు.. ఈయన మాత్రమే దీన్ని డీల్‌ చేయగలడు..' అంటూ ఈ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.

 

న్యూ ఇయర్‌కి అనగా జనవరి 1న ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేయనున్నారు. ప్రశాంతి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కొలను శైలేష్‌ నిర్మిస్తున్నారు. 'ఫలక్‌నుమా దాస్‌' చిత్రంతో విశ్వక్సేన్‌ విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్‌ అందుకుంటాడో చూడాలి మరి. ఇకపోతే, నాని సమర్పణ అంటే, కంటెంట్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని అర్ధం చేసుకోవాలి. సో సమ్‌థింగ్‌ డిఫరెంట్‌ కంటెంట్‌తోనే ఈ సినిమా తెరకెక్కుతోందనుకోవాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS