2016 దూసుకొచ్చిన కామెడీ కెరటాలు

మరిన్ని వార్తలు

'థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ' అనే డైలాగ్‌ తెలీని వాళ్లు ఉండరు. అలాగే ఆ డైలాగ్‌ చెప్పిన నటున్ని కూడా తెలీని వాళ్లుండరు. కృష్ణవంశీ సినిమా 'ఖడ్గం'తో పాపులరైన డైలాగ్‌ ఇది. ఆ డైలాగ్‌ చెప్పింది పృద్వీ. కామెడీలో కొత్త స్టైల్‌ పృద్వీది. నిజానికి ఈయన సినీ ప్రయాణం ఈ నాటిది కాదు అప్పుడెప్పుడో 'ఆ ఒక్కటీ ఆడక్కు' అనే సినిమాతో స్టార్ట్‌ అయ్యింది. కానీ స్టార్‌ కమెడియన్‌గా మారింది మాత్రం గోపీచంద్‌ సినిమా 'లౌక్యం'తో. ఆ సినిమాలో 'బాయిలింగ్‌ స్టార్‌ బబ్లూ'గా పృద్వీ పండించిన కామెడీకి ధియేటర్‌ లో నవ్వుల పంట పండింది. ఆ తర్వాత ప్రతీ సినిమాలోనూ పృద్వీ కోసం ప్రత్యేకించి ఓ క్యారెక్టర్‌ని డిజైన్‌ చేయడం స్టార్ట్‌ చేశారు డైరెక్టర్స్‌. అలా థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటూ స్టార్ట్‌ చేసిన కామెడీ కెరీర్‌ని ఈ ఏడాది హీరో దాకా చేర్చుకోగలిగాడు పృద్వీ. కమెడియన్‌గా 'పోకిరి, ఢీ, కిక్‌, దూకుడు, 'అత్తారింటికి దారేది, ఇలా ఒక్కటేమిటీ చాలా సినిమాల్లో కమెడియన్‌గా తన సత్తా చాటుకున్నాడు. 'లౌక్యం' సినిమా కెరీర్‌ని టర్న్‌ చేసిన సినిమాగా మిగిలింది పృద్వీ కెరీర్‌లో. ప్రస్తుతం బిజీ కమెడియన్‌ అయిపోయాడు పృద్వీ. ఈ ఏడాది మీలో ఎవరు కోటీశ్వరుడు' సినిమాతో హీరోగా అవతారమెత్తాడు. ఈ సినిమాలో ఇంటర్మీడియట్‌ చదివే కుర్రాడిగా పృద్వీ నటన ఆకట్టుకుంది. ముద్దుగుమ్మ సలోనితో ఈ సినిమాలో డ్యూయెట్లు కూడా వేసుకున్నాడు మన బాయిలింగ్‌ స్టార్‌ బబ్లూ. కమెడియన్‌గానే కాకుండా హీరోగా కూడా ఫర్వాలేదనిపించాడు ఈ సినిమాతో. 


ఇక ఇలాగే కామెడీతో పాపులర్‌ అయ్యి హీరోగా దూసుకొచ్చిన మరో కామెడీ కెరటం సప్తగిరి. తనదైన డిక్షన్‌తో కామెడీని పండించాడు సప్తగిరి. 'పరుగు' సినిమాతో బక్క పలుచని బాడీతో అల్లు అర్జున్‌ ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌లో ఒకడిగా బలమైన డైలాగులు సింపుల్‌గా పేల్చిన సప్తగిరి, తర్వాత వరుస పెట్టి తన కామెడీలో దూకుడు పెంచేశాడు. 'లవర్స్‌' సినిమాలో 'మగజాతి ఆణిముత్యాన్ని' అంటూ బరి తెగించి తిరుగుతున్న అమ్మాయిలపై విరుచుకుపడే సీన్‌లో ఆయన పండించిన కామెడీకి కడుపు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు ఆడియన్స్‌. అలాగే 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌', ప్రేమకథా చిత్రమ్‌' తదితర సినిమాల్లో సప్తగిరి కామెడీ అద్భుతం. అలాగలా కామెడీతో చాలా తక్కువ టైంలో పాపులరై, ఇప్పుడు హీరో దాకా ఎదిగాడు. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' సినిమాతో ఈ ఏడాది మన ముందుకు వచ్చాడు హీరోగా. ఈ సినిమాకి పవన్‌ కళ్యాణ్‌ కూడా ఫుల్‌ సపోర్ట్‌ని అందించడం విశేషం. ఈ సినిమా కోసం డాన్సులు, ఫైట్లు కూడా చేసేశాడు సప్తగిరి. 


ఇంతవరకూ బ్రహ్మానందం, ఆలీ, సునీల్‌ ఇలా చాలా మంది కమెడిన్లు హీరోలుగా మారి తన సత్తా చాటారు. ఈ ఏడాది కామెడీ నుండి హఠాత్తుగా హీరోలుగా దూసుకొచ్చారు ఈ కామెడీ కెరటాలు. హీరోలుగా ఫుల్‌గా సక్సెస్‌ అయ్యారని మాత్రం చెప్పలేము. కానీ ఓపెనింగ్స్‌ మాత్రం బాగా వచ్చాయి వీరి సినిమాలకు. అలా ఈ ఏడాది సప్తగిరి, పృద్వీ హీరోలుగా వచ్చిన సినిమాలు ఒన్‌ ఆఫ్‌ ది స్పెషల్‌ అని చెప్పుకోవచ్చు. 
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS